జనసేన(JANASENA) అధినేత(CHIEF) పవన్ కల్యాణ్(PAWAN KALYAN)కు సీరియస్(SERIOUS) వార్నింగ్(WARNING) ఇచ్చారు మంత్రి(MINISTER) పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(PEDDIREDDY RAMACHANDRA REDDY). చిత్తూరు(CHITOOR)లో మీడియా(MEDIA)తో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు(CHANDRABABU) అరెస్ట్(ARRSET) వ్యవహారంపై స్పందించారు.. ఇక, పవన్ కల్యాణ్(PAWAN KALYAN)కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం అలవాటు అయ్యిందంటూ మండిపడ్డారు. గతంలో వాలంటీర్ల(VOLUNTEERS)పై ఆరోపణలు చేశారు.. ఈ రోజు 50 మంది హత్యలు అని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, పోలీసులను(POLICE) ఈ అంశాలపై విచారణ చేయాల్సిందిగా కోరుతాం.. అవి అబద్ధాలని తేలితే పరువు నష్టం దావా వేస్తాం అంటూ హెచ్చరించారు.
ఇక, చంద్రబాబు అరెస్ట్ విషయంలో సొంత కుమారుడు నారా లోకేష్(NARA LOKESH)లో కూడా పవన్ కల్యాణ్ పడిన తపన కనిపించలేదు.. అది నటనా? లేదా? మరేంటి అని ప్రజలకు తెలుసు అంటూ సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇన్నర్ రింగ్ రోడ్(INNER RING ROAD), ఫైబర్ గ్రిడ్(FIBER GRID) పై కూడా విచారణ జరుగుతుంది.. అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవు అన్నారు.. చంద్రబాబు అరెస్టుకు… పెట్టుబడులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి.. ఇలాంటి కేసులు అన్ని చాలా ఎదుర్కోవాలని కామెంట్ చేశారు.. చంద్రబాబు అరెస్ట్ కి మేం సంతోష పడట్లేదు.. ఎవరైన సంతోషించారు అంటే అది రామారావు గారి ఆత్మ మాత్రమే అన్నారు.. మరోవైపు.. చంద్రబాబు తప్పు చేయలేదు అని లాయర్లు, టీడీపీ నాయకులు మాట్లాడలేదు.. 24 గంటలు దాటాక కోర్టుకు ప్రవేశ పెట్టారు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడారు అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.