Monday, December 23, 2024
Home తెలంగాణ తెలంగాణ ఎన్నికల ఫైట్‌లోకి పవన్ కల్యాణ్.. పవన్ మ్యానియా తెలంగాణలో పని చేస్తుందా..?

తెలంగాణ ఎన్నికల ఫైట్‌లోకి పవన్ కల్యాణ్.. పవన్ మ్యానియా తెలంగాణలో పని చేస్తుందా..?

by Editor
0 comment 45 views
Pavan Kalyan | ADBC Telugu

తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా దూకారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని 8స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేనాని.. రెండు పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. తెలంగాణలో అవినీతి పాలన నడుస్తుందని, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జనసేనాని. ఐతే ప్రచారం చేసినంత మాత్రాన పవన్.. స్టార్ ఇమేజ్ తెలంగాణలో పని చేస్తుందా..? ఎన్నికల్లో ఓట్లు కురిపిస్తాయా అనే చర్చ జరుగుతోంది. జనసేనతో బీజేపీ పొత్తు వ్యూహం ఫలిస్తుందా..? పవన్ సపోర్ట్, ప్రచారం ఎన్నికల్లో బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది అనేది ఆసక్తిగా మారింది.

పవన్ కల్యాణ్.. సినిమాలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. కానీ ఆ ఇమేజ్ ఎన్నికలకు వచ్చే వరకు ఓట్లుగా మారుతాయా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ ను తెలంగాణ ఎన్నికల్లోనూ రంగంలోకి దింపింది తెలంగాణ బీజేపీ. పవన్ అభిమానులతో పాటు.. జనసేన కేడర్, ఆంధ్రా సెటిలర్ల ఓట్లను దృష్టిలో పెట్టుకుని జనసేనతో పొత్తు మంతనాలు నడిపింది. జనసేనకు 8స్థానాలు ఇచ్చి.. మిగతా స్థానాల్లో బీజేపీకి సపోర్ట్ చేయాలని కోరింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఫోకస్ అంతా ఏపీపైనే ఉంది. తెలంగాణలో పెద్దగా జనసేన ఉనికి లేదనే చెప్పాలి. జనసేనకు తెలంగాణలో చెప్పుకోతగ్గ కేడర్ కానీ, లీడర్లు కానీ లేరు. కానీ నటుడిగా అభిమానులు ఉండటంతో.. కొంత వరకైనా అది ఓటు బ్యాంకుగా మారుతుందనే ఆశతో బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. కానీ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. ఏపీలోనే పవన్ సినిమా ఇమేజ్ పెద్దగా పని చేయలేదు. కేవలం జనసేన ఒక్కటి అంటే ఒక్క సీటే గెలిచింది. స్వయంగా పవన్ కల్యాణ్ రెండు చోట్లా పోటీ చేస్తే.. రెండు చోట్లా ఓడిపోయారు. అలాంటిది తెలంగాణలో పవన్ ఇమేజ్ పని చేస్తుంది అనుకోవడం, అభిమానుల రూపంలో ఓట్లు పడతాయి అనుకోవడం బీజేపీ అత్యాశే అవుతుందని చెప్పాలి. తెలంగాణలో పవన్ ను ఒక్క సినిమా నటుడిగానే చేస్తున్నారు. తప్ప ఆయనను నాయకుడిగా గుర్తించడం లేదని పొలిటికల్ సర్కిల్ లో జరుగుతున్న చర్చ. పవన్ ను చూడడానికి జనం వస్తారు కానీ అవి అన్నీ ఓట్లుగా మారుతాయని అనుకోలేమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తెలంగాణలో నిన్నటి వరకు పవన్ యాక్టివ్ పాలిటిక్స్ లో లేరు. అసలు ఎన్నికల్లో పోటీ చేద్దామనే ఉద్దేశంలో కూడా కనిపించలేదు. కేలవం బీజేపీ ఒత్తిడి మేరకే పవన్ తెలంగాణ ఎన్నికల్లో పోటీకి ఒప్పుకున్నట్టు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎన్నికలు వచ్చాక కనిపించే నేతను తెలంగాణ ప్రజలు నమ్ముతారని, అభిమానాన్ని క్యాష్ చేసుకుని ఓట్లు రాల్చుకుందామనికున్న బీజేపీ ఎత్తుగడ పెద్దగా పనిచేయక పోవచ్చనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. పవన్ ను తెలంగాణ ప్రజలు కేవలం నటుడిగానే చూస్తారని, అతన్ని నాయకుడిగా గుర్తించడం లేదని ప్రచారం జరుగుతోంది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News