Monday, December 23, 2024
Home అంతర్జాతీయం Pavan Kalyan Key Comments: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pavan Kalyan Key Comments: ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

by Mahadev
0 comment 66 views
Pavan Kalyan Key Comments

“ఒక దేశం-ఒకే ఎన్నిక”పై ప్రతిపక్ష కూటమి (I.N.D.I.A) మాజీ రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్(Ramanath singh kovind) నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు. 16 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ కమిటీ అన్ని అంశాలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫార్సులను చేయనుంది. ఇక, ఎన్డీఏ భాగస్వామ పక్షంగా ఉన్న జనసేన(Janasena) పార్టీ ఈ విధానంపై కీలక నిర్ణయం తీసుకుంది. ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ విధానానికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు పార్టీ చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌.. దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల ఎన్నో సానుకూలతలు ఉన్నాయన్న ఆయన.. వేల కోట్ల ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడుతుందన్నారు. భద్రతా బలగాలు దేశ రక్షణపైనే దృష్టి నిలుపుతాయి.. రాజ్యాంగ దినోత్సవం అయిన నవంబర్ 26న ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) ప్రసంగిస్తూ దేశమంతటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నామని, దీనిపై ప్రజలు కూడా చర్చించాలని పేర్కొన్నారు. అప్పటి నుంచి జమిలి ఎన్నికల అంశం తెరపైకి వచ్చిందని గుర్తుచేశారు.

ఇక, జమిలి ఎన్నికలు దేశానికి కొత్తకాదన్నారు పవన్‌ కల్యాణ్.. స్వాతంత్ర్యానంతరం 1952, 1957, 1962, 1967 సంవత్సరాల్లో దేశమంతటికీ ఒకేసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయన్న ఆయన.. తరువాత రాజకీయ పరిణామాల క్రమంలో ఈ సంప్రదాయం కొనసాగించలేకపోయారు. దీనివల్ల దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరగడం నిత్యకృత్యంగా మారిపోయింది. దీంతో ఎన్నికల నిర్వహణపైనే ప్రభుత్వాలు, పాలకులు దృష్టి నిలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగంలాంటి అంశాలతోపాటు ఆర్థిక అభివృద్ధి, విద్యావ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం వంటి విషయాలపై దృష్టి నిలిపేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి ఆయా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల మీదనే ఉండిపోవడంతో ప్రజా ఉన్నతికి సంబంధించిన అంశాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టడానికి ఇదో కారణంగా నిలిచిందని.. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజల చర్చ పూర్తిగా దేశాభివృద్ధి గురించే జరుగుతుందన్నారు.

దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన కేంద్ర భద్రతా బలగాలు నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఎన్నికల విధుల్లోనే ఉండిపోతున్నాయన్నారు పవన్‌ కల్యాణ్(Pavan Kalyan).. ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా భద్రతా బలగాలకు విలువైన సమయం ఆదా కావడంతోపాటు దేశ భద్రతపై మరింత దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందన్నారు. వలస కార్మికులు ప్రతీసారి ఎన్నికలు జరుగుతుంటే ఎన్నో ఇబ్బందులుపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒకేసారి ఎన్నికలు జరిగితే అంతరాష్ట్ర వలస కార్మికులకు ఇబ్బందులు తప్పుతాయన్నారు. రాష్ట్రాల శాసనసభలకు, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిగితే చాలా సమయం, ప్రజాధనం కూడా ఆదా అవుతుంది. ప్రతిసారీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులను బట్టి మతం, కులం వంటి ఇతర విషయాలపై దేశమంతటా చర్చ జరుగుతోంది.

ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ఇలాంటి చర్చలు ఒకసారే జరిగి మిగిలిన సమయం దేశం ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉందన్నారు. ఎన్నికల ఖర్చు ప్రతీ ఐదేళ్లకు గణనీయంగా పెరిగిపోతోంది. 1951-52 ఎన్నికలు కేవలం రూ. 11 కోట్ల ఖర్చుతో నిర్వహిస్తే ఆ భారం 2014 వచ్చేసరికి రూ. 30 వేల కోట్లకు చేరిందని గుర్తుచేశారు.. అదే 2019 పార్లమెంట్ ఎన్నికల(Parliment Elections)కు వచ్చేసరికి రూ. 60 వేల కోట్లకు చేరిందని.. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరిగితే అదే ఖర్చుతో రాష్ట్రాల శాసన సభలకు, లోక్ సభకు పాలన వ్యవస్థను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా వరకు ప్రజాధనం వృథా కాకుండా ఉంటుందన్నారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News