జనసేన(JANASENA) అధినేత పవన్ కల్యాణ్(PAWAN KALYAN) మలివిడత వారాహి విజయయాత్ర(VARAHI VIJAYA YATHRA)కు రెడీ అవుతున్నారు. ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లా(KRISHNA DISTRICT) నుంచి నాలుగో విడత(FOURTH PHASE) విజయయాత్రను ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(NADENDLA MANOHAR) ప్రకటన విడుదల చేశారు. . అక్టోబర్ 1(OCTOBER 1) నుంచి ఈ నాలుగో విడత వారాహి యాత్రను అవని గడ్డ నుంచి ప్రారంభించబోతున్నట్లు జనసేన(JANASENA) పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాల్గవ విడతలో అవనిగడ్డ(AVANIGADDA), మచిలీపట్నం(MACHILIPATNAM), పెడన(PEDANA), కైకలూరు(KAIKALURU) నియోజకవర్గాలలో వారాహి విజయయాత్ర కొనసాగుతుందని తెలిపారు.
మచిలీపట్నం కేంద్రంగానే నాలుగు నియోజకవర్గాలలో వారాహి విజయయాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొంటారని తెలిపింది. ఈ మేరకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నాలుగు నియోజకవర్గాల నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారాహి విజయయాత్రను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అవనిగడ్డలో మొదలయ్యే ఈ యాత్ర మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా సాగనుంది. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలో మూడు వారాహి విజయ యాత్రలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో.. టీడీపీతో కలిసి పోటీ చేస్తాము అని ప్రకటించిన జనసేనాని ఈ సరి వారాహి విజయ యాత్రలో వైసీపీ(YCP) మీద ఎలా విరుచుకుపడతారో వేచి చూడాలి.