టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అరెస్టుపై మరోసారి స్పందించారు జనసేన(JANASENA) అధిపతి పవన్ కల్యాణ్(PAWAN KALYAN). రెండేళ్లుగా జైలులో ఉన్న సీఎం జగన్.. ఇప్పుడు అందరినీ నేరగాళ్లుగా చిత్రీ కరించేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారాయాన. తాను చంద్రబాబును కలిసేందుకు వస్తానని ప్రచారం చేస్తూ వైసీపీ నేతలే(YCP LEADERS) లా అండ్ ఆర్డర్(LAW AND ORDER) సమస్యలు(ISSUES) సృష్టిస్తున్నారని పవన్ ధ్వజమెత్తారు. ఆదివారం రాత్రి మంగళగిరి పార్టీ(MANGALAGIRI) కార్యాలయంలో(OFFICE) మాట్లాడిన జనసేన అధినేత చంద్రబాబుకు ఎప్పుడూ తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ‘మంగళగిరిలో నా పార్టీ కార్యాలయం ఉంది. నేను పార్టీ సమావేశాల కోసమే మంగళగిరికి పయనమయ్యాను.
అయితే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబును కలిసేందుకు వెళ్తున్నానని ప్రచారం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలను సృష్టించేందుకు వైసీపీ నేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నేను బాధ్యతగల ఓ పార్టీ అధ్యక్షుడిని. నేను రెచ్చగొట్టే వ్యాఖలు ఎందుకు చేస్తాను. నా పార్టీ ఆఫీసుకు వెళ్లేందుకు అనుమతులు కావాలా? విశాఖలో నన్ను నిర్భందించినప్పుడు చంద్రబాబు నాకు మద్దతుగా నిలిచారు. నాకు అండగా నిలబడిన వ్యక్తికి సహాయం చేయడం నా సంస్కారం. అందుకే చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఆయనకు ఎప్పుడూ నా మద్దతు ఉంటుంది. సీఎం జగన్(CM JAGAN) రెండేళ్ల పాటు జైలు(TWO YEARS JAIL)లో ఉన్నారు. ఇప్పుడు ఆయన అందరినీ నేరగాళ్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.
ప్రజాస్వామ్యంలో ఇవి చీకటి రోజులన్నారు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్. ఏపీలో ప్రజలు ఇక జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిపై కేసులు, దాడులు చేసే సంస్కృతి రాష్ట్రంలో నెలకొందని విమర్శించారు. బెయిల్ మీద ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయ్యారని, చట్టాలు సరిగ్గా పనిచేస్తే ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ఆయన ప్రశ్నించారు.
దేశంలో కీలకమైన జీ-20 జరుగుతున్నప్పుడు చంద్రబాబును అరెస్టు చేసి డైవర్ట్ చేశారన్నారు. వైసీపీ వాళ్లు యుద్ధం కోరుకుంటున్నారని, తాము కూడా అందుకు రెడీ అన్నారు పవన్‌కల్యాణ్. కాగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(SKILL DEVELOPMENT SCHEME) కేసులో చంద్రబాబు నాయుడికి 14 రోజుల(14 DAYS) జ్యుడీషియల్ రిమాండ్(JUDICIAL REMAND) విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు(VIJYAWADA ACB COURT) తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. సుమారు 40 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత.. ఈనెల 22 వరకు చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పును ప్రకటించింది. నేరపూరిత కుట్రకు చంద్రబాబు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్న న్యాయమూర్తి.. ఆయనకు 409 సెక్షన్ వర్తిస్తుందని వివరించారు. అలాగే రిమాండ్‌ను తిరస్కరించాలన్న చంద్రబాబు వాదనను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. ఈ రాత్రికి చంద్రబాబును సిట్ ఆఫీస్‌కి తరలించనుండగా, రేపు రాజమండ్రికి తీసుకెళ్లనున్నారు.