జాతిపిత మహాత్మాగాంధీ(MAHATHMA GANDHI) జయంతిని పురస్కరించుకుని.. రాష్ట్రంలో జరుగుతున్న హింస(VIOLENCE)కు వ్యతిరేకంగా జనసేన(JANASENA) అధినేత(CHIEF) పవన్ కల్యాణ్(PAWAN KALYAN) రెండు గంటల పాటు మౌనదీక్ష(MOUNA DEEKSHA) చేపట్టారు. దీక్షకు ముందు కృష్ణా జిల్లా(KRISHNA DISTRICT) మచిలీపట్నం(MACHILIPATNAM)లోని సువర్ణ కల్యాణ మండపానికి విచ్చేసిన పవన్.. గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ, అవినీతికి అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చారు. 2024లో జనసేన ప్రభుత్వం వచ్చాక.. గాంధీ జయంతిని బందరులో చేసుకుందామని అన్నారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు సహజమేనన్న పవన్ కల్యాణ్.. వైఎస్ జగన్ మాదిరిగా కేసులు పెట్టి, జైళ్లకు పంపే ఆలోచన సరికాదని విమర్శించారు. జగన్‌పై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని.. అతని (జగన్) ఆలోచన, పాలన నిర్ణయాలను వ్యతిరేకించానని అన్నారు. గ్రామ స్వరాజ్యాన్ని ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం చంపేసిందని పవన్ మండిపడ్డారు. రాజకీయాల్లో బురద పడుతుందని తనకు తెలుసని.. అయినా ముందుకే సాగుతామని పవన్ వ్యాఖ్యానించారు. మౌన దీక్షలో పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఇక.. తెలంగాణ(TELANGANA) అసెంబ్లీ(ASSEMBLY) ఎన్నికలు(ELECTIONS) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ పార్టీలు కసరత్తులు ముమ్మరం చేశాయి. తాజాగా, తెలంగాణలో 32 నియోజకవర్గాల్లో(32 CONSTITUENCIES) పోటీ చేస్తున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఆయా స్థానాల జాబితా విడుదల చేసింది. కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 9 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు జనసేన జాబితా చూస్తే అర్థమవుతోంది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడమే జనసేన లక్ష్యం అని పార్టీ హైకమాండ్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.
జనసేన పోటీ చేసే నియోజకవర్గాలు.. కూకట్ పల్లి, పటాన్ చెరు, ఎల్బీ నగర్, సనత్ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, మల్కాజిగిరి, మేడ్చల్, మునుగోడు, ఖమ్మం, వైరా, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, అశ్వరావుపేట, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్ ఘన్ పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరేకల్, హుజూర్ నగర్, మంథని, కోదాడ, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మధిర