విజయవాడలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 1 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మూడు రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాలకు ఇంద్రకీలాద్రి, అందంగా ముస్తాబు కానుంది. అంతేకాదు కనకదుర్గమ్మకు సుప్రభాతం సేవ, స్నపనాభిషేకాన్ని ఈ నెల 30 తెల్లవారుజామున 3 గంటలకు నిర్వహించనున్నారు. ఈ పవిత్రోత్సముల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యేక్ష పరోక్ష సేవలను ఆలయాధికారులు నిలిపేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఇంద్రకీలాద్రిపై ఈ పవిత్రోత్సము కొనసాగనున్నాయి. అయితే, మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభమయ్యి.. రేపు తెల్లవారు జామున 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ, అనంతరం స్నాపనభిషేకం, నిత్యా అలంకరణ, పవిత్రాల ధారణ జరుగనుంది. అనంతరం చండీహోమం, యాగా శాల దగ్గర 11 గంటలకు గణపతి పూజ, మండపారాధన అగ్నిప్రతిష్టంభన, దేవతారాధన జరుగతాయి. దీంతో 9 గంటల నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనానికి పర్మిషన్ ఇస్తారు.
ఇక, రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి, మంత్ర పుష్పము జరుగనుంది. అయితే, ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత విధి తాతావ్ దేవతారాధన.. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి , మంత్ర పుష్పము యధావిధిగా కొనసాగనుంది. చివరి రోజు 10:30కు పుర్ణాహుతి కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము కార్యక్రమలతో ఈ పవిత్రోత్సవములు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా రేపటి నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అమ్మవారి నిత్య కైంకర్యాలను దేవస్ధాన అర్చకులు నిర్వహించనున్నారు.