Monday, December 23, 2024
Home జాతీయం Nipah virus outbreak in Kerala: కేరళలో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి

Nipah virus outbreak in Kerala: కేరళలో నిపా వైరస్ కలకలం.. ఇద్దరు మృతి

by Mahadev
0 comment 61 views
Nipah virus outbreak in Kerala

ప్రమాదకరమైన వైరస్ తో కేరళ(Kerala)లోని కోజికోడ్(Kozhikode) జిల్లాలో రెండు మరణాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇవి నిపా వైరస్(Nipah virus) కారణంగానే సంభవించినట్లు కేరళ ఆరోగ్య శాఖ అనుమాన వ్యక్తం చేస్తుండగా సోమవారం వైద్యాధికాలతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణ జార్జ్(Veena George) అనంతరం ఘటనకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. మృతుల బంధువు కూడా ఐసీయూ(ICU)లో చికిత్స పొందుతున్నట్టు వెల్లడించారు. ఈ మరణాలకు గల కారణాలను తెలిసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. మంగళవారం మధ్యాహ్నం దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారం రానుండగా మొదటి మరణం ఆగస్టు 30న సంభవించిందని అధికారులు తెలిపారు.

2018 నుంచి 2021 వరకు కేరళలోని అనేక నిపా వైరస్(Nipah virus) కేసులు వెలుగులోకి వచ్చాయి. దక్షిణ భారతలో 2018 మే 19న మొదటి నిపా కేసు నమోదయింది. 2019 మరో నీపా కేసు వెలుగులోకి వచ్చింది. 2021 లోను మెదడు వాపు వ్యాధితో చనిపోయిన బాలుడులో నిఫా వైరస్ గుర్తించినట్లు వైద్యులు వెల్లడించారు. 1989లో మలేషియాలో తొలిసారిగా నిపా గుర్తించారు. ఈ వైరస్ జీవుల జాబితాలో పందులు, ఫ్రూట్ బ్యాట్ అనే గబ్బిలాలు, కుక్కలు, మేకలు, గొర్రెలు, పిల్లులు, గుర్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫ్రూట్ బ్యాట్ లో ఇది సహజంగానే ఉన్నట్టు వెల్లడించారు. అయితే వాటిపై ఎటువంటి ప్రభావం చూపించలేవు. వైరస్ గల గబ్బిలాలతో(Bats) ప్రత్యక్షంగా లేదా పరోక్ష కాంట్రాక్ట్ ద్వారానే నిపా వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

దీనికి ప్రత్యేకమైన టీకాలు, చికిత్స లేకపోవడం భయాలను మరింత పెంచుతున్నాయని, కోవిడ్ తో పోలిస్తే నిపా వైరస్ అత్యంత ప్రమాదకరమైంది. రోగి నుంచి వెలువడే స్రావాలు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ముఖ్యంగా రక్తం, మూత్రం, ముక్కు, నోటి నుండి వచ్చే స్రావాలలో వైరస్ ఉంటుందని వైద్యులు తెలిపారు. ఇది సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులకే నిపా సోకుతుంది. ప్రోటీన్లు మెదడు కేంద్రం అధికణాల్లోనే కేంద్రీకృతం అవుతాయని వైద్యులు తెలిపారు. వ్యాధి సోకిన గబ్బిలాల మూత్రం పండ్లు మీదకి చేరినప్పుడు ఆ పండ్లు రసాల ద్వారా కూడా మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News