నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల – చైతన్య జొన్నలగడ్డ మ్యూచ్యువల్ డైవర్స్‌తో విడిపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. గత కొంత కాలంగా దూరంగా ఉంటున్న వీరు ఇరువురు.. మ్యూచ్యువల్ అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు మే 19న కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయగా.. అది ఈరోజుతో అఫీషియల్ గా పూర్తయింది అని తెలుస్తోంది.
వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు అధికారికంగా ప్రకటించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నట్లయింది. ఇక వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే వివరాల మీద మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ ఏడాది మార్చి నెలలో జొన్నలగడ్డ చైతన్య అతని ఇంస్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసినప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అని ప్రచారం మొదలైంది. అప్పుడే వీరు విడిపోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అప్పటికి నిహారిక ఆ ఫోటోలను తొలగించకపోవడంతో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏమో అనుకున్నారు. ఆ తర్వాత నిహారిక కూడా చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం తెర మీదకు వచ్చింది. ఇక వీరి విడాకుల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మెగా ఫ్యామిలీ నుంచి ఈ విషయం మీద ఏదైనా క్లారిటీ వస్తుందేమో వేసి చూడాలి.