Monday, December 23, 2024
Home ఆంధ్రప్రదేశ్ NIA searches in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ చోట్ల సోదాలు.. ప్రకటన విడుదల

NIA searches in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ చోట్ల సోదాలు.. ప్రకటన విడుదల

by Mahadev
0 comment 40 views
NIA searches in Telugu states

తెలుగు రాష్ట్రాల్లో 62 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ(NIA ) సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాల కేసులో ఈ సోదాలు చేశారు. సోదాలకు సంబంధించిన వివరాలతో ఎన్‌ఐఏ ప్రకటన విడుదల చేసింది. ముంచింగిపట్టు మావోయిస్టు( munchingipattu Maoist) కేసులో భాగంగా తనిఖీలు చేసినట్లు పేర్కొంది. ఒకరిని అరెస్టు చేయగా.. ఆయుధాలు, నగదు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

‘‘తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల తనిఖీలు చేశాం. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు చంద్ర నర్సింహులును అరెస్టు చేశాం. తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం. కడపలో రూ.13 లక్షల నగదు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నాం. ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు నిర్వహించాం. గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, ఏలూరు, విశాఖ, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూల్‌లో సోదాలు జరిగాయి.

తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హనుమకొండ, ఆదిలాబాద్‌లో జిల్లాల్లో సోదాలు చేశాం. సీఎల్‌సీ, ఏబీఎంసీ, సీఎంఎస్, కేఎన్‌పీఎస్, పీడీఎం, పీకేఎస్, పీకేఎం, ఆర్‌డబ్ల్యూఏ, హెచ్‌ఆర్‌ఎఫ్, సీఆర్‌పీపీ, ఐఏపీఎల్ నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిపాం. మావోయిస్టు అనుబంధ సంఘాల నాయకులు మవోయిస్టులకు సహకరిస్తున్నట్లు ఆధారాలున్నాయి’’ అని ఎన్‌ఐఏ ప్రకటనలో వెల్లడించింది.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News