తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో జాతీయ దర్యాఫ్తు సంస్థ (NIA) సోదాలు నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు(Civil rights leaders), అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు(Inspections) నిర్వహిస్తున్నారు. మావోయిస్టు(Maoist) సంఘాలతో సంబంధాల కేసులో ఈ సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో భవాని, న్యాయవాది సురేశ్ ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్‌పేట(Usman Sahebpet)లో ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లలో ఎన్‌ఐఏ(NIA) అధికారులు తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కావలి బాలయ్య(Kavali Balayya) ఇంటిలో సోదాలు జరుగుతున్నాయి. గతంలో బాంబు పేలుళ్ల కేసులో బాలయ్య కుమార్తె పద్మ, అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారు.
గుంటూరు జిల్లా కొండపాటూరులో తమలపాకుల సుబ్బారావు(Tamalapakula Subbarao), ప్రకాశం జిల్లా చీమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు, సంతమాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమహేంద్రవరంలోని బొమ్మేరులో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి కోనాల లాజర్, శ్రీకాకుళంలో మిస్కా కృష్ణయ్య ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. కృష్ణయ్య ఆమదాలవలస మండలం తోటవాడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అనంతపురంలో ఉపాధ్యాయుడు శ్రీరాములు ఇంట్లోనూ ఎన్‌ఐఏ(NIA) అధికారులు సోదాలు నిర్వహించారు.