కృత్రిమ మేధస్సు రోజు రోజుకు ప్రాచుర్యం పొందుతుంది.. టెక్నాలజీ పరంగా దూసుకుపోతుంది.. ఇప్పటికే పలు రకాల ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇప్పుడు వచ్చేవారం మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. వారం OpenAI కొత్త ChatGPT అప్‌డేట్‌లను ప్రారంభించనుంది. గత నెలలో వినియోగదారుల కోసం బీటాలో కస్టమైజ్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఫీచర్‌ను ప్రారంభించిన చాట్ జీపిటి ఇప్పుడు డెవలపర్ అడ్వకేట్, డెవలపర్ రిలేషన్స్ ఎక్స్పర్ట్, లోగాన్ కిల్‌పాట్రిక్ వంటి కొత్త అప్‌డేట్‌లను ప్రకటించింది..
ఇక క్లిప్ ట్రిప్ ద్వారా హైలైట్ చేయబడిన ఈ కొత్త ఫీచర్లలో ప్రాంప్ట్‌లు, example prompts, suggested replies, follow-up questions లు ఉన్నాయి. ఈ మార్పులు ChatGPTతో ఇంట్రాక్షన్స్ మరింత ఆకర్షణీయంగా, డైనమిక్ గా చేస్తాయి. అదనంగా ChatGPT ప్లస్ సబ్‌స్క్రైబర్‌లు ఇప్పుడు GPT-4 కోసం Default setting అందుబాటులో కూడా ఉన్నాయి. ఇది కొత్త చాట్‌ను ప్రారంభించిన ప్రతిసారీ పబ్లిక్‌గా అందుబాటులో ఉన్న తాజా OpenAI లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను మాన్యువల్‌గా టోగుల్ చేయవలసిన అవసరం లేకుండా చేస్తాయి..
ఓపెన్ AI కోడ్ ఇంటర్‌ప్రెటర్ ప్లగిన్‌ని ఉపయోగిస్తున్న ChatGPT ప్లస్ వినియోగదారుల కోసం మల్టీఫుల్ ఫైల్స్ ను ఒకేసారి అప్లోడ్ చెయ్యొచ్చు..ప్లగ్ఇన్ పనివిధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. ఈ అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో వినియోగదారుల నుంచి ప్రశంసలను అందుకుంటున్నాయి. కొందరు హిస్టరీ సెర్చ్ ఫీచర్ కోరగా ఇది ఇప్పటికే iOSలో అందుబాటులో ఉందని కొందరు ప్రముఖులు చెబుతున్నారు.. కాగా, ఈ AI మనుషుల సామార్థ్యాన్ని తగ్గిస్తుందని, దానివల్ల తమ ఉద్యోగాలు పోతున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..