ఇప్పటివరకు మనం వాట్సాప్‌లో ఎలాంటి ఫోటోలు పంపినా.. లేదా ఏవైనా ఫోటోలను డౌన్ లోడ్ చేసుకున్నా.. అవి క్లారిటీ లేకుండా ఉండేవి. ఎందుకంటే హై క్వాలిటీ ఫోటోలను వాట్సాప్ సపోర్ట్ చేసేది కాదు. అంతేకాదు హై క్వాలిటీ ఫోటోలను, వీడియోలను ఆటోమేటిక్‌గా కంప్రెస్ చేసేంది. అందుకే ప్రతి ఫోటోలోనూ క్లారిటీ.. క్వాలిటీ అనేది ఆటోమేటిక్‌గా తగ్గిపోయేది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది వాట్సాప్. అతి త్వరలో తీసుకొచ్చే లేటెస్ట్ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చని వివరించింది. ఇకపై యూజర్లు ఫోటోలను ఇతరులకు పంపే సమయంలో ‘హై క్వాలిటీ’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. దీంతో మీరు పంపే ఫోటోకు హై క్వాలిటీ ఫోటో అనే ట్యాగ్ వస్తుంది. అది రిసీవ్ చేసుకున్న వారికి కూడా హై క్వాలిటీ ఫోటో అని తెలుస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఫోటోల వరకే పరిమితం చేస్తున్నట్లు సమాచారం..
అయితే వాట్సాప్‌లో వీడియోలను హై క్వాలిటీతో పంపేందుకు ఇంకా ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. కేవలం డాక్యుమెంట్ ఆప్షన్ ద్వారా మాత్రమే షేర్ చేయగలుగుతున్నాం. వాట్సాప్ ఫీచర్ నివేదిక ప్రకారం.. అతి త్వరలో వచ్చే కొత్త ఫీచర్‌తో వాట్సాప్ నుంచి హెచ్‌డి ఫోటోలను పంపుకోవచ్చు. ముందుగా ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లలో కొందరు బీటా వర్షన్ వారికి ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించి స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్లు హై క్వాలిటీ ఫోటోలను ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఇతరులకు కూడా సులభంగా పంపుకోవచ్చు.
వాట్సాప్‌లో హెచ్‌డి ఫోటోలు పంపాలనుకునే ఆండ్రాయిడ్ యూజర్లు 2.23.12.13 వాట్సాప్ బీటా, IOS యూజర్లు 23.11.0.76 వాట్సాప్ బీటా ఫీచర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ఈ లేటెస్ట్ ఫీచర్ త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే దీని కోసం మరికొంత సమయం ఎక్కువగా పట్టొచ్చు. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్లో లిమిటెడ్ ఫోటోలను మాత్రమే పంపుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోల ఇన్ చాట్ షేరింగుకు మాత్రమే పరిమితం చేసినట్లు వాట్సాప్ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ వీడియోలకు, స్టేటస్‌లకు వర్తించదని స్పష్టం చేసింది. అయితే హెచ్‌డి క్వాలిటీతో వీడియోను పంపాలనుకుంటే డాక్యుమెంట్ రూపంలో సెండ్ చేసుకోవచ్చు.
అంతేకాదు వాట్సాప్ మరికొన్ని కొత్త ప్రయోగాలు చేస్తూ.. యూజర్లను ఆకట్టుకునే ఆలోచనలో ఉంది. త్వరలో వాట్సాప్‌లోనే ఆఫీస్ మీటింగ్స్ నిర్వహించుకునేందుకు లేటెస్ట్ ఫీచర్‌ను తీసుకురానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ చివరి దశ టెస్టింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే వాట్సాప్ ‘స్క్రీన్ షేరింగ్’ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్ బీటా టెస్ట్ యూజర్లకు అందుబాటులో ఉంది. వీటితో పాటు త్వరలో ‘వాట్సాప్ యూజర్ నేమ్స్’ అనే ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఫోన్ నెంబర్లతో పని లేకుండా.. కేవలం పేర్ల సాయంతో చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది.