Navratri Fasting Mistakes: హిందూ సంప్రదాయం ప్రకారం దేవి శరన్నవరాత్రులకు చాలా ప్రాధాన్యం ఉంది. 9 రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది రూపాలలో పూజిస్తారు. ఈ 9 రోజులు ఉపవాసం పాటించడంతో పాటు కచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉపవాసం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఆరోగ్యం ప్రతికూల ప్రభావాలు కూడా ఉంటాయి. నవరాత్రులు ఉపవాసం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
ఆకలితో ఉండవద్దు
నవరాత్రులు ఉపవాసం ఉంటే భోజనం మానేయాలని కాదు. తినడం మానేస్తే శరీరంలో ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. ముఖ్యంగా గర్బీణుల శరీరానికి కనీసం 1200 కేలరీలు అవసరం. కాబట్టి తక్కువ వ్యవధిలో ఏదో ఒకటి తింటూ ఉండాలి.
వ్యాయామం
కొంతమంది ఉపవాస సమయంలో కూడా వ్యాయామం చేస్తారు. ఇది మంచిది కాదు. దీనివల్ల ఎనర్జీ లెవల్స్ పడిపోతాయి. దీనివల్ల కళ్లు తిరగి పడిపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
నూనె పదార్థాలు వద్దు
రోజంతా ఆకలితో ఉన్న వెంటనే ఆయిల్ ఫుడ్ తింటే అది ఆరోగ్యానికి హానికరం. సాయంత్రం వేళల్లో వేయించిన బంగాళదుంపలు, పూరీలు, పకోడీలు తింటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
డీ హైడ్రేషన్
ఉపవాస సమయంలో చాలా మంది ఎక్కువగా నీరు తాగరు. దీనివల్ల వారు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ఈ సమస్యను నివారించడానికి తగినంత నీరు తాగుతూ ఉండాలి. ఇది కాకుండా టీ లేదా కాఫీ తాగడం మంచిది కాదు. దీంతో ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి.
9 రోజుల నిబంధనలు
9 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం దుర్గామాతను పూజించాలి. సాయంత్రం హారతి ఇవ్వాలి. అమ్మకు నచ్చిన పువ్వులు, స్వీట్లు సమర్పించాలి. నవరాత్రుల చివరి రోజున ప్రత్యేక పూజలు చేయాలి. అష్టమి, నవమి తిథిలలో 9 మంది అమ్మాయిలకు స్వీట్లు, పాయసం తినిపించాలి. ఆడపిల్లల ఆశీస్సులు తీసుకుని బహుమతులు అందించాలి. దీనివల్ల తల్లి సంతోషిస్తుంది.