టీడీపీ(TDP) అధినేత(CHIEF) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నారా భువనేశ్వరి(NARA BHUVANESHWARI) నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు సత్యమేవ జయతే(SATYAMEVA JAYATHE) అనే పేరును పెట్టారు. దీక్షకు ముందు రాజమహేంద్రవరం(RAJAMAHENDRAVARAM)లోని గాంధీ విగ్రహానికి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇక, భువనేశ్వరి వెంట తెలుగు మహిళల నేతలు భారీగా తరలి వచ్చారు. మహాత్మ గాంధీ జయంతి రోజున ఒక్క రోజుకు నారా భువనేశ్వరి దీక్షకు దిగింది. సాయంత్ర 5గంటల వరకు ఈ దీక్ష చేయనున్నారు. ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో(RAJAHMUNDRY CNETRAL JAIL) చంద్రబాబు నాయుడు(CHANDRABABU NAIDU) కూడా దీక్ష చేస్తున్నారు. ఏపీ(AP)లో వైసీపీ(YCP) ప్రభుత్వం అక్రమ అరెస్ట్ లకు నిరసనగా ఆయన నిరసన చేస్తున్నారు. నారా భువనేశ్వరికి మద్దుతుగా చంద్రబాబు, నారా లోకేశ్, బ్రహ్మణి, బాలకృష్ణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేతలు(TDP LEADERS), కార్యకర్తలు ఈ దీక్ష చేస్తున్నారు.
అయితే, చంద్రబాబు నాయుడు గత 23 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం(SKILL DEVELOPMENT SCAM) కేసులో ఆయనకు ఏసీబీ కోర్టు(ACB COURT) రిమాండ్ విధించింది. అయితే ఇది తప్పుడు కేసు అని.. హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసినప్పటికి అక్కడ ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో చంద్రబాబు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై రేపు విచరణ జరుగుతుంది. ఇక, నారా భువనేశ్వరి ట్విట్టర్(TWITTER) వేదికగా ఓ పోస్ట్ చేసింది.. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశారని ఆమె అన్నారు. ఆయన జ్ఞాపకాలతో ఈరోజు తన గుండె నిండిపోయింది.. ఎలాంటి క్లిష్ట సమయాల్లోనైనా సత్యానికి కట్టుబడి ఉండాలనే విషయాన్ని ఎన్టీఆర్ తమకు నేర్పించారని భువనేశ్వరి తెలిపారు.న్యాయానికి ఆయన కట్టుబడిన విధానం, తెలుగు ప్రజలకు సేవ చేయడానికి ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన విధానం.. ఆయన పిల్లలుగా మా అందరికి స్ఫూర్తిదాయకమని భువనేశ్వరి చెప్పుకొచ్చారు.