పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం బ్రో. పాల గోపాల’ సినిమాలో మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించిన పవన్.. ఈ చిత్రంలో మరోసారి టైం అనే దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ మాటలు అందించగా .. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సితంకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక జూలై 28 న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ” మై డియర్ మార్కండేయ ” అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. అయితే సమయం మాత్రం చెప్పలేదు. త్వరలోనే అంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో మార్కండేయ అలియాస్ మార్క్ గా సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సాంగ్ కేవలం తేజ్ మీదనే చిత్రీకరించారని టాక్. ఈ చిత్రంలో తేజ్ సరసన కేతిక శర్మ కనిపిస్తోంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మోషన్ పోస్టర్ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ లో మ్యూజిక్ ఆల్బమ్ పై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మరి థమన్ ఏ రేంజ్ లో ఇస్తాడో చూడాలి.
రీమేక్ సినిమా అయినా.. బ్రో మీద అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. టీజర్ తో సినిమాపై అంచనాలు పెట్టుకోవచ్చని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇందులో పవన్ దేవుడిగా కనిపిస్తుండగా.. తేజ్ సాఫ్ట్ వేర్ గా కనిపించనున్నాడు. మరి ఈ సాంగ్ ను మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. నిజం చెప్పాలంటే.. సినిమా రిలీజ్ కావడానికి చాలా తక్కువ సమయం ఉంది.. ప్రమోషన్స్ ఇంకా స్లోగా ఉన్నాయి. ఈ సాంగ్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టి.. వరుస ప్రమోషన్స్ చేస్తే సినిమాపై ఇంకా హైప్ క్రియేట్ అవుతుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు, ఎలాగూ పవన్ ప్రమోషన్స్ కు రాడు .. మిగిలినవారైనా ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు లేకపోతే సరికొత్త ప్రమోషన్స్ మొదలుపెడితే బావుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి మేకర్స్ ఏ రేంజ్ లో ప్రమోషన్స్ మొదలుపెడతారో చూడాలి.