ఐటీ మంత్రి కేటీఆర్(IT Minister KTR) పై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(MP Komati Reddy Venkata Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయాల్లో అనుభవం లేని వ్యక్తి కేటీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రక్రియ మొదలుపెట్టినప్పుడు అమెరికాలో ఉన్నాడని, రెండో దశ(Second Phase) ప్రక్రియ మొదలు కాగానే వచ్చాడు కేటీఆర్ అని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మాతో పొత్తు పెట్టుకున్నాడని, వైఎస్ వద్దు అన్నా.. ఎదిరించి మాట్లాడామన్నారు. తెలంగాణ కాంగ్రెస్(Congress) ఇచ్చింది అంటే.. బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చినట్టు ఉందంటున్నాడని, కేటీఆర్ .. మీ తండ్రి మొదటి సభలో చెప్పిన మాటలు విను… కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ ప్రకటన రాలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komati Reddy Venkata Reddy) అన్నారు. పిల్లలు చనిపోతున్నారు అని తెలంగాణ ప్రకటన చేశారు సోనియాగాంధీ అని, తెలంగాణ పేరుతో కేటీఆర్.. లక్షల కోట్లకు ఎదిగాడని ఆయన ఆరోపించారు.
‘సోనియా గాంధీ(Sonia Gandhi)ని విమర్శించడం మానుకో. ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చాం. 20 ఏండ్ల క్రితం 400 అంటే దాని విలువ ఎంతో తెలుసుకో. ఆ రోజుల్లోనే 32 లక్షల ఇండ్లు కట్టించినం. మేము కట్టిన ఇల్లు..ఇప్పుడు 10 లక్షల విలువ. 30 వేల ఇండ్లు కట్టలేదు నువు నీ మోకానికి. కాళేశ్వరం డబ్బుల కోసం కట్టావు. పాలమూరు ప్రాజెక్టు లో ఒక్క మోటార్ కూడా పెట్టలేదు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ మేము 70 శాతం పనులు పూర్తి చేసినం. 2 వేల కోట్లు ఇస్తే పనులు అన్ని పూర్త్జి అయ్యేవి’ అని అన్నారు.
‘కేటీఆర్..నీ వెంట ఉన్నది అంతా తెలంగాణ ద్రోహులే. దానం తెలంగాణ ఉద్యమకారులను కొట్టాడు. తలసాని.. సబితా.. మహేందర్ రెడ్డి లాంటి ద్రోహులు ఉన్నారు. . మల్లారెడ్డి..పాలు..పూలుతో పాటు భూములు కూడా అమ్ముకున్నాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. తెలంగాణ ద్రోహులు అంతా ని వెనకాల ఉన్నారు. కాంగ్రెస్ మీదా ఆరోపణలు చేస్తున్నావు మానుకో. పువ్వాడ అజయ్ కి… తెలంగాణ ఉద్యమం కి సంబంధం ఏముంది. సోనియాగాంధీ ని ఇంకో సారి అంటే పాపం తగులుతోంది కేటీఆర్. సోనియా గాంధీ తో గ్రూప్ ఫోటో ఎందుకు దిగావు. పనికి రాని మాటలు మాట్లాడకు. ఇంటర్ పేపర్ దిద్దడం రాదు. టీఎస్పీఎస్సీ పరీక్షలు పెట్టలేవు కానీ.. మాపై మాట్లాడుతున్నాడు’ అంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు.