ప్రధాని మోడీ ఈ నెల 8న ప్రధాని మోడీ వరంగల్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన షెడ్యూల్‌ను పిఎంవో విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని వరంగల్ పర్యటన ముగించుకుని తిరిగి హకీంపేట నుంచి రాజస్థాన్ కు బయలుదేరే వరకు మొత్తం 3 గంటల 45నిమిషాలు తెలంగాణలో ఉండనున్నారు ప్రధాని మోడీ.
8న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ పోర్ట్ కు 9.45 గంటలకు చేరుకుంటారు మోడీ. 9. 45 గంటలకు హెలికాప్టర్ లో వరంగల్ కు పయనం. 10.15 గంటలకు మామునూరు ఎయిర్ పోర్ట్ కు చేరుకుని రోడ్డు మార్గం ద్వారా 10.30 భద్రకాళి టెంపుల్ కు చేరిక. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని 10.45 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 11.00 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంకు చేరుకుంటారు. 11 నుంచి 11.30 గంటల మధ్య వర్చువల్ గా 6110 కోట్లతో చేపట్టే జాతీయ రహదారులకు, 521 కోట్లతో చేపట్టే కాజీపేట రైల్వే వ్యాగన్ రిపేర్ అండ్ మ్యానుప్యాక్షరింగ్ యూనిట్ కు శంకుస్థాపన. 11.45 నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభకు హాజరు. 12.50 గంటలకు వరంగల్ మామునూరు హెలిప్యాడ్ నుంచి హకీంపేటకు పయనం. 1.45 గంటలకు హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో రాజస్థాన్ కు మోడీ తిరుగు పయనం కానున్నారు.