రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కోద్ది.. ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతుంది.. అటు ప్రతిపక్షాలు రోజుకో కార్యక్రమంతో ముందుకు వెళుతుంటే అధికార బీఆర్ఎస్ పార్టీ కూడ తగ్గేదే లే అంటూ ముందుకు వేళుతుంది. దీనిలో భాగంగానే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో ఎమ్మెల్సి కవిత పాదయాత్ర ఇప్పుడు హట్ టాఫిక్ గా మారింది. బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత చీఫ్ గెస్టుగా పాల్గొన్నారు. కవిత బోదన్ చేరుకోగానే బీఆర్ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికారు. ఆచన్ పల్లి చౌరస్తా నుండి సభ నిర్వహిస్తున్న షుగర్ ప్యాక్టరి గ్రౌండ్ వరకు ఎమ్మెల్సి కవిత చేపట్టిన పాదయాత్ర ఆసక్తిగా మారింది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగించారు ఎమ్మెల్సీ కవిత.. దారిపోడువున ఉన్న వాళ్లకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. స్థానికులు కూడ పాదయాత్రలో పాల్గొన్నారు.
బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ సమావేశానికి పాదయాత్రగా వెళ్లారు. కవితకు ఎమ్మెల్యే షకీల్ భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. సభలో పాల్గొన్న కవిత ఎన్నికల శంఖారావం ప్రారంభించారు. రాజకీయ ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు సంధించారు. ప్రత్యేకించి- కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కవిత. రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు.
‘వెయ్యి ఎలుకలను తిన్న పిల్లి హజ్ యాత్రకు వెళ్లింది’ అని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’ను పోల్చారు. భోదన్‌లో జరిగిన పార్టీ సమావేశానికి కవిత హాజరయ్యారు. 62 ఏళ్లు దేశాన్ని పాలించి ‘గరీబీ హఠావో’ నినాదాన్ని ఇచ్చినా పేదలు పేదలుగానే మిగిలిపోయారని కాంగ్రెస్‌పై ఆమె మండిపడ్డారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత కవిత ఈ ప్రాంతానికి రావడం ఇదే తొలిసారి. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.