తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి పద్మశాలీలు కుల వృత్తిని కోల్పోతూ వచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా పద్మశాలిల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. కుల సంఘాలు అనేవి ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉండాలని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు నుంచి పద్మశాలి లు కుల వృత్తిని కోల్పోతూ వచ్చారని, శాంతి భద్రతలకు మారు పేరు కేసీఆర్ ప్రభుత్వమని ఆమె వ్యాఖ్యానించారు.
వ్యాపారస్తులకు కూడా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని, చేనేత, బీడీ కార్మికులకు కాపాడుకుంటున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఆమె అన్నారు. చేనేత రంగానికి పన్ను వేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని, బీఅర్ఎస్ నాయకులు ఎవరు అయిన మాట ఇస్తే తప్పరని ఆమె వ్యాఖ్యానించారు. నగరంలోని 51 తర్పలకు 5 లక్షల చొప్పున నిధులను ఇస్తున్నామని ఆమె తెలిపారు.
ఇదిలా ఉంటే.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో టాస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఐటీ జాబ్‌మేళాను ఎమ్మెల్సీ కవిత మంగళవారం ప్రారంభించారు. ఈ జాబ్‌మేళాకు పెద్ద సంఖ్యలో యువత తరలివడం విశేషం. ఇందులో గ్లోబల్ లాజిక్‌తోపాటు వివిధ విదేశీ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన 41 కంపెనీలు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. జాబ్‌మేళాలో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని చెప్పారు. గత జాబ్‌మేళాలో ముగ్గురు దివ్యాంగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.