వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్న సంఘటన శనివారం చివ్వెంల మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ స్టేజి వద్ద 65వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుండి విజయవాడకు తన కాన్వాయ్‌తో ఎమ్మెల్యే వంశీ బయల్దేరాడు. ఈ క్రమంలో చివ్వెంల మండలం కాసింపేట గ్రామ స్టేజి వద్దకు వంశీ కాన్వాయ్‌కు మరో వాహనం అడ్డు వచ్చింది.
దీంతో ఎమ్మెల్యే కాన్వాయ్‌లోని ఓ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్‌లోని స్కార్పియో వెహికల్స్ ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. అప్పటికే ఎమ్మెల్యే వంశీ కారు ముందుకు వెళ్ళింది. దీంతో అతని కారుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ అతడి కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.