ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ పథకంసంజీవిని అని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి రజని(AP Health Minister Rajani) పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ లో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి రజని మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీలో గతం కంటే ఎక్కువ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం(Arogyashri Scheme)లో 1050 నుంచి 3,257 ప్రొసీజర్లకు పెంచామనీ.. ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ సంజీవిని అని మంత్రి రజని వెల్లడించారు. ఇక అటు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను ప్రకటించింది. ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరల ప్రకటన పోస్టర్ ఆవిష్కరించారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) మాట్లాడుతూ.. రైతులకు ఇకపై పంటకు గిట్టుబాటు ధర లభించిందన్న బెంగలేదని వెల్లడించారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని.. సీజన్ ప్రారంభానికి ముందే మద్దతు ధరలు ప్రకటించారని చెప్పారు. రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలన్నదే సీఎం ఆలోచన అని.. తొలిసారిగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
జగనన్న గోరుముద్ద’ (Jagannanna Gorumudda)దేశానికే ఆదర్శంగా నిలిచిందని.. ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాలు సైతం అనుసరిస్తుండటమే ఇందుకు నిదర్శనమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ప్రస్తుతం ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు అమలు చేస్తోన్న ఈ పథకాన్ని త్వరలో ఇంటర్‌మీడియట్‌కు వర్తింప చేయా లని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. శాసనసభ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా సోమ వా రం పలువురు సభ్యుల డిగిన ప్రశ్నలకు మంత్రి బొత్స బదులిచ్చారు.
సీఎం వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక విద్యావ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పు లు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మన విద్యా విధానంలోని మార్పులకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని చెప్పా రు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. అమ్మఒడి పథకంతో డ్రాప్ అవుట్స్ గణనీయంగా తగ్గాయని వెల్లడించారు. గోరుముద్దతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులంతా బడిబాటపట్టారన్నారు. నాడు– నేడుతో పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు.