స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్(Skill development scam) కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో టీడీపీ(TDP) నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి రోజా(AP Minister Roja). స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో హైకోర్టు తీర్పుతోనైనా టీడీపీ శ్రేణులు కళ్లు తెరుచుకోవాలని అన్నారు. అసెంబ్లీలో స్కిల్ స్కామ్ కేసుపై చర్చించకుండా పారిపోయారని ఆమె టీడీపీ ఎమ్మెల్యేలను ఎద్దేవా చేశారు. నిన్నటిదాకా స్కిల్ స్కాంపై ప్రభుత్వం దగ్గర ఆధారాలే లేవన్న టీడీపీ నేతలు.. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు ఏం చెబుతారని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై సభలో చర్చించకుండా టీడీపీ ఎమ్మెల్యేలు తప్పించుకున్నారని రోజా విమర్శించారు.
చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)కు శుక్రవారం ఒకే రోజు కోర్టుల్లో ఒకే రోజు మూడు ఎదురుదెబ్బలు తగిలాయి. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీని మరో రెండు రోజులు పొడగిస్తూ ఉదయాన ఏసీబీ కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ప్రశ్నించేందుకు తమ కస్టడీకి అప్పగించాలంటూ సీఐడీ అభ్యర్థనపై సానుకూలంగా స్పందిస్తూ… రెండు రోజుల సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ తీర్పు ఇచ్చింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.