దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ అమ్మకానికి పెట్టిన మోదీ().. ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చాడో చెప్పాలని మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రశ్నించారు. మంచిర్యాల పర్యటన ముగించుకొని పెద్దపల్లి జిల్లాకు వచ్చిన ఆయన రామగుండంలో సింగరేణి భూనిర్వాసితులకు పరిహార పంపిణీ, దళితబంధు, గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రభుత్వ ఉత్తర్వులను అందజేశారు. కార్పొరేట్ కంపెనీలకు వంత పాడుతున్న ప్రధాని మోదీ(PM MODI).. ప్రభుత్వ సంస్థలను తన దోస్తులకు అగ్గువకే కట్టబెడుతూ చందాలు తీసుకుంటున్నారని మంత్రి కేటీఆర్ (Minister KTR)ఆరోపించారు. సింగరేణిని అమ్మబోమని తెలంగాణలో హామీ ఇచ్చిన మోదీ.. దిల్లీకి వెళ్లగానే సంస్థ నాలుగు గనులను వేలానికి పెట్టారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా.. వేలం పాటలో పాల్గొనమని ఉచిత సలహా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
గుజరాత్ మినరల్స్ (Gujarat Minerals) ఒక న్యాయం.. తెలంగాణకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న మోదీ.. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వచ్చిండో చెప్పాలని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్ (KCR) అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం అనే పరిస్థితి ఉందన్నారు.గత ప్రభుత్వాల పాలనలో సింగరేణి కార్మికులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని.. సంస్థ లాభాల్లో వాటా కింద కేవలం 18 శాతం మాత్రమే ఇచ్చేవారని కేటీఆర్ పేర్కొన్నారు. నేడు బీఆర్ఎస్ ( BRS) హయాంలో.. సింగరేణి లాభాల్లో కార్మికులకు 42శాతం వాటా ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలు పరిష్కరించినట్లు గుర్తు చేశారు.
పెద్దపల్లి పట్టణంలో జూనియర్, డిగ్రీ కాలేజీ(Junior & Degree College)ల ఏర్పాటు కోసం కొట్లాడిన గోదావరిఖనికి.. మెడికల్ కాలేజీ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా.. అని మంత్రి కేటీఆర్(Minister KTR) ప్రశ్నించారు. నేడు జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడమే కాకుండా 5% రిజర్వేషన్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో వారంటీ లేని కాంగ్రెస్ పార్టీ.. నేడు రాష్ట్రంలో గ్యారంటీలు ఇస్తామని చెబుతోంది. ముసలి నక్కలాంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతోందని విమర్శించారు. కాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదినట్లే అవుతుందని మంత్రి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి (CM KCR) అయితే.. కాంగ్రెస్ కంటే రెట్టింపు మంచి చేస్తారని పేర్కొన్నారు.