దేశంలోనే మైనార్టీల సంక్షేమంలో(Welfare of Minorities) తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా నిలించిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి (Minister Jagdish Reddy)పేర్కొన్నారు. సూర్యాపేటలోని పి.ఎస్.ఆర్ సెంటర్ వద్ద గల చిన మజీద్ సమీపంలో రూ. 80లక్షల వ్యయంతో నిర్మించనున్న మైనార్టీ కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి తప్పా వారి సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు.
స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనార్టీల బతుకులు మారలేదన్నారు. వారి జీవితాల్లో వెలుగులు కానరాలేదన్న మంత్రి.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లిం సోదరుల(Muslim Brotherhood) జీవితాల్లో వెలుగులు నిండాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CM KCR)ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు. షాదీముబారక్(Shadi Mubarak), మైనారిటీ గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు, ఇమామ్, మౌజన్‌కు గౌరవవేతనం, హజ్ యాత్రికులకు ఏర్పాట్లు, పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణలాంటి అనేక కార్యక్రమాలు మైనారిటీల ప్రగతికి మైలురాయిగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణమ్మ, మౌలానా అత్తర్ సాబ్, గాయాజ్ బాయ్, ఆఫీజ్ ఖాలీల్ సాబ్, రియాజ్, కౌన్సిలర్లు తాహెర్ పాష, జహీర్, గండూరి రాధిక, షాదీ ఖానా చైర్మన్ సయ్యద్ సలీం, షాహద్ మౌలానా, అజీజ్, గౌస్ ఖాన్, తాహేర్, గౌస్, నజీర్, తదితరులు పాల్గొన్నారు.