తెలంగాణలో జనాలను నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు.. జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) స్పష్టం చేశారు. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం కావాలా..? నల్ల చట్టాలు తెచ్చిన బీజేపీ కావాలా? అనే విషయాన్ని ఆలోచించుకోవాలని అన్నారు. తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్(Self Declaration) చేసుకుందని మంత్రి తెలిపారు. సిద్దిపేట(Siddipeta) జిల్లా హుస్నాబాద్ పబ్లిక్ మీటింగ్‌లో మంత్రి హరీష్ రావు((Minister Harish Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా హాట్రిక్ కేసీఆర్ దే అని చెబుతారన్నారు. కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) ఎన్ని కుట్రలు చేసినా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ వాళ్లు రోజుకో మేనిఫెస్టో రోజు కో డిక్లరేషన్ ఇస్తున్నారని, 50 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న ఏం చేయలేకపోయారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ (CM KCR) ఏం చెప్పాడో అది చేసి చూపించాడు, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, రైతు బీమా ఇచ్చాడని ఆయన అన్నారు. కేసీఆర్ జనాలను నమ్ముకున్నాడు, బీజేపీ ఏమో జమిలీని నమ్ముకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అబద్దాలు కావాలా.. కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కావాలా.. కేసీఆర్ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఒకటి కూడా ఉండదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్లు వడ్లు కొనకున్న మన కేసీఆర్ వడ్లు కొన్నాడని, తిట్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యండి కిట్లు కావాలంటే కేసీఆర్ కు ఓటేయండని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్ ను తీసుకువచ్చి గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు.