సిద్దిపేట రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వ కోట కింద 330 కోట్లు కేటాయించిందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ…. సిద్దిపేటకు పుష్ పుల్ రైలు రావడం గొప్ప వరమని అన్నారు. నీళ్లు, నిధులు జిల్లా కలను నిజం చేసింది కేసీఆరే అని తెలిపారు. ప్రభుత్వాలు తెలంగాణను పట్టించుకోలేదని ఆరోపించారు.
బీజేపీ వాళ్లు వచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్దిపేటకు రైలు తెస్తామంటూ బీజేపీ అబద్ధాలు చెప్పిందంటూ మండిపడ్డారు. 2006 వ సంవత్సరంలో రైల్వే లైన్ మంజూరు అయిందని 33 శాతం రాష్ట్ర వాటా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ రైల్వే లైన్ కు రూపకల్పన చేశారని తెలిపారు. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి మారారు కానీ ఏ ఒక్కరూ రైల్వే లోనే తేలేదు అని చెప్పారు.
తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్ర ప్రజల అదృష్టమని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట, మెదక్, కరీంనగర్ పై ఆనాటి ప్రభుత్వాలు కక్ష కట్టాయని తెలిపారు. బీజేపీ నాయకులు రైల్వే లైన్ తమ వల్లే వచ్చిందని చెబుతుండడం సిగ్గుచేటన్నారు. 33 శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా కడితే కనీసం సీఎం కేసీఆర్ ఫోటో కూడా పెట్టలేదని మండిపడ్డారు. 2,508 ఎకరాల భూసేకరణ కోసం 310 కోట్లు తెలంగాణ ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఇది చూస్తుంటే సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్నట్టు ఉందన్నారు.