సత్యం, అహింస మార్గాన బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ(Gandhiji) అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Dayakar Rao) అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో వారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అహింసా మార్గంలో ఏదైనా చేయగలం అని నిరూపించిన వ్యక్తిగా గాంధీజీ చరిత్రలో నిలిచిపోయారన్నారు.
గాంధీ చూపిన అహింసా మార్గంలో స్వరాష్ట్రం సాధ్యం చేసి, వలసలు తగ్గించిన గొప్ప నేత సీఎం కేసీఆర్(CM KCR) దేశానికి గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే, మన రాష్ట్రానికి కేసీఆర్ స్వాతంత్ర్యాన్ని తెచ్చారని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ది చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని కడిగిన ముత్యంలా తయారు చేశాం. మన గ్రామాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని చెప్పారు.
స్వచ్ఛ భారత్‌లో మన రాష్ట్రమే నంబర్ వన్‌గా నిలిచామన్నారు. ఇవే గాక రైతులకు నూతన రెవెన్యూ చట్టం, రైతు బంధు,రైతుబీమా లాంటి పథకాలతో రైతుల కష్టాలు తీరుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Daysam Vinay Bhaskar) కూడా చైర్మెన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, సిక్తా పట్నాయక్, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.