అవకాడోలు ఈమద్యకాలంలో త్వరితగతిన అందరికీ సుపరిచితమైన పండుగా ఉంది. ఇది ఇంచుమించు ప్రతి రెస్టారెంట్ మెనూలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ అవకాడో, ఒక వైవిధ్యభరితమైన పండుగానే కాకుండా, వీటిని సలాడ్స్, స్మూతీస్, డోనట్స్, శాండ్ విచ్ వంటి అనేక రకాల ఆహార పదార్ధాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. పొటాషియం, ల్యూటేన్, ఫోలేట్ వంటి వాటితో సహా దాదాపు 20 రకాల విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది. అవకాడోలు బి విటమిన్స్ కు మంచి మూలంగా చెప్పబడుతుంది, క్రమంగా ఇది శరీరంలోని వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
అవకాడోలు అత్యధికంగా ఫైబర్ తో లోడ్ చేయబడి ఉంటాయి, క్రమంగా ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఊబకాయంతో సంబంధం ఉన్న అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవకాడోలో “కరిగే, అలాగే కరగని” ఫైబర్లు రెండూ ఉంటాయి. క్రమంగా 25% కరిగే ఫైబర్ ఉండగా, 75% కరగని ఫైబర్ ఉంటుంది. అవకాడోలు ఆరోగ్యవంతమైన మోనోశాచ్యురేటెడ్ కొవ్వులతో ప్యాక్ చేయబడ్డ అత్యుత్తమ పండ్లలో ఒకటిగా ఉంటుంది., అంతేకాకుండా, ఇది మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అవకాడోలను తరచుగా తీసుకోవడం మూలంగా, రక్తంలో ట్రైగ్లిజరైడ్ల స్థాయిలను 20% వరకు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను 22% వరకు తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను 11% వరకు పెంచవచ్చునని అధ్యయనాలు చూపిస్తున్నాయి.
అవకాడోలో ఉండే ఇన్సులిన్ రెసిస్టెంట్స్, డయాబెటిక్ పేషంట్స్ లో రక్తంలో చక్కర స్థాయిలను మెరుగుపరిచే మోనోసాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్దం చేయడానికి, ఇన్సులిన్ స్థాయిలని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. అదేవిధంగా, అవకాడోలలో ఉండే ఫైబర్ నిక్షేపాలు రక్తంలో చక్కర నిల్వలు పెరగకుండా చూడడంలో సహాయం చేస్తాయి. అవకాడోలలో ల్యూటేన్, జియాక్సాంథిన్ వంటి కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి శుక్లాలు, కళ్ళలో మచ్చల వంటి కంటి రుగ్మతల ప్రమాదాన్ని తగ్గించగలవు. అవకాడోలలో విటమిన్ ఎ అధిక మొత్తాలలో ఉన్న కారణంగా, వృద్దాప్యం కారణంగా తలెత్తే కంటి మచ్చల అవకాశాలను తగ్గించడంలో కూడా సహాయపడగలదని చెప్పబడుతుంది. అవకాడోలు క్యాన్సర్ చికిత్సలో కూడా ముఖ్యపాత్రను పోషిస్తాయి. మానవుల లింఫోసైట్స్లో, కీమోథెరపీ మూలంగా తలెత్తే దుష్ప్రభావాలను తగ్గించడానికి ఈ పండు ఎంతగానో సహాయపడుతుంది. అవకాడో సారం ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉందని మరొక అధ్యయనంలో తేలింది.
అవకాడోలలో మంచి మొత్తాలలో ఫోలేట్ ఉంటుంది. ఇది గర్భస్రావం, నాడీ లోపాల ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన ఖనిజంగా ఉంటుంది. దీనికి అదనంగా మీ శిశువు, పాల నుంచి ఘనాహారానికి తరలించినా, అవకాడో వంటి రుచికరమైన ఆహారాలను మీ బిడ్డకు అందజేయడానికి ప్రయత్నించండి. ఇవి మృదువుగా ఉన్న కారణంగా, మీ బిడ్డ ఆహారాన్ని నమలడాన్ని సులభతరం చేస్తుంది. మోనోశాచ్యురేటెడ్ కొవ్వులకు మంచి వనరుగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, అధికంగా మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు కలిగిన ఆహారాలు డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక రుగ్మతలను తగ్గించడంలో ఎంతగానో సహాయం చేస్తాయని చెప్పబడుతుంది. ఈ పండులో ఫోలేట్ కూడా ఉంటుంది. ఇది వ్యాకులతను కూడా తగ్గిస్తుంది. అవకాడోలోని నూనెలు ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించవచ్చునని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. అవకాడోలలో ఫైబర్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న కారణంగా, ఇది జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను పెంచడానికి సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, ప్రేగు ప్రకోప సిండ్రోమ్ వంటి అన్ని జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అవకాడోలలో కూడా యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. క్రమంగా బ్యాక్టీరియా, ఎస్చెరిచియా కోలి వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.