ప్రగతి భవన్(PRAGATHI BHAVAN)లో తెలంగాణ(TELANGANA) ముఖ్యమంత్రి(CHIEF MINISTER) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును(KALVAKUNTLA CHANDRA SEKHAR RAO) మేఘాలయ(MEGHALAYA) సీఎం(CM) కాన్రాడ్ కె సంగ్మా(CONRAD K SANGMA) మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భనవ్ చేరుకున్న సీఎం సంగ్మాను కేసీఆర్ సాదరంగా ఆహ్వానించాడు. అనంతరం ఆయనకు కేసీఆర్ తేనీటి విందు(TEA PARTY) ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇష్టాగోష్ఠి నిర్వహించారు.
మేఘాలయ సీఎం సంగ్మాను కేసీఆర్ శాలువాతో సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మాకు సీఎం కేసీఆర్ వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్(KTR), హరీష్ రావు(HARISH RAO), ఎర్రబెల్లి దయాకర్ రావు(ERABELLI DAYAKAR RAO), ఎమ్మెల్సీలు(MLC) పల్లా రాజేశ్వర్ రెడ్డి(PALLA RAJESWARA REDDY), మధుసూదనాచారి(MADHUSUDHANA CHARY), ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి(MLA ROHITH REDDY), ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్(VINODH KUMAR), మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి(EX CENTRAL MINISTER VENUGOPAL CHARY), బీఆర్ఎస్ నేతలు(BRS LEADERS) దాసోజు శ్రవణ్(DASOJU SRAVAN), కె వంశీధర్ రావు(K VAMSIDHAR RAO)తో పాటు ఇతరులు పాల్గొన్నారు.