వైజాగ్ లో మెడికో ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. డాబా గార్డెన్స్‌లో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ గదిలో రమేష్ కృష్ణ అనే యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతోంది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.కేరళ రాష్ట్రం ఒలరిక్కర ప్రాంతానికి చెందిన రమేష్ కృష్ణ.. సెలవుల కోసం సొంత గ్రామానికి వచ్చింది. ఈనెల 13న తన ఇంటి నుంచి తిరుగు ప్రయాణమై 18వ తేదీన వైజాగ్ చేరుకున్న ఆ యువతి.. డాబా గార్డెన్స్‌లోని లాడ్జిలో అద్దెకు దిగి.. ఆగస్టు 9వ తేదీన గది ఖాళీ చేసింది.
తిరిగి మళ్లీ ఈ నెల 24న ఆమె అదే గదికి వచ్చింది. 24న చెక్ అవుట్ చేయాల్సి ఉండగా, ఆమె గది నుంచి బయటకు రాలేదు.. లోపల నుంచి గడియాపెట్టి ఉండటంతో లాడ్జి నిర్వహకులకు అనుమానం వచ్చి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపును బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించగా, ఆ యువతి గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని వేలాడుతున్నట్టు కనిపించింది. ‘‘తన చావుకు ఎవరూ కారణం కాదనీ.. సారీ అమ్మ’’ అంటూ ఆ సూసైడ్ నోట్‌లో ఉందని టూ టౌన్ సిఐ తెలిపారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.