33 ఏళ్ల లూసీ లెట్బీ అనే నర్సు చైల్డ్ సీరియల్ కిల్లర్‌గా మారింది. తన సంరక్షణలో ఉన్న చిన్నారులను చంపుతూ పైశాచిక ఆనందం అనుభవించింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుగురు నవజాత శిశువులను హత్య చేసింది. మరో ఆరుగురు చిన్నారులను చంపేందుకు ప్రయత్నించింది. ఐదుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను చంపిన లూసీ చర్య ఆధునిక యునైటెడ్ కింగ్‌డమ్ చరిత్రలో సంచలనంగా మారింది. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని చెస్టర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది. పిల్లలను చంపేందుకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, నరాల్లోకి గాలి నింపడం, అధిక మోతాదులో పాలు ఇవ్వడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు.
ఈ మారణ దుశ్చర్యకు పాల్పడుతున్న విషయాన్ని భారత సంతతి వైద్యుడు రవి జయరాం గుర్తించాడు. దీంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు చిన్నారుల హత్య ఘటనపై భారత సంతతి వైద్యుడు రవి జయరాం కీలక విషయాలను తెలిపారు. తాను ఆ నర్సు గురించి ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే.. ఆ పసికందుల ప్రాణాలు మిగిలిఉండేవని విచారం వ్యక్తం చేశారు. 2015-16 నుంచే ఈ దారుణాలకు పాల్పడుతుందని డాక్టర్ తెలిపారు. మరోవైపు లూసీ లెట్బీ (33)ని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ నర్సును పట్టించడంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ జైరామ్ సహా ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం పిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నారు.

తీర్పు అనంతరం రవి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన పిల్లలు బతికి ఉంటే…ఈరోజు ఆ పిల్లలు పాఠశాలకు వెళ్తుండే వారన్నారు. 2015 జూన్‌లో ముగ్గురు నవజాత శిశువులు మరణించినప్పుడు.. తాను ఆందోళన వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు చనిపోతే.. నా తోటి సీనియర్ వైద్యులు కూడా సమావేశాలు నిర్వహించి ఆసుపత్రి పాలకవర్గ అధికారులతో ఆందోళన వ్యక్తం చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులను కలిసేందుకు 2017 ఏప్రిల్‌లో నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అనుమతించిందని డాక్టర్ జైరాం తెలిపారు. చిన్నారుల అనుమానాస్పద మరణాల గురించి తాము పోలీసులకు చెప్పడంతో.. పోలీసులు దానిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో నర్స్ లూసీపై తొలిసారి అనుమానం వచ్చింది. విచారణ, వివరణాత్మక విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేశారు. కోర్టు ఆమెకు సోమవారం జీవిత ఖైదు విధించింది.