భాద్రపద మాసంలో ప్రకృతి అంత పచ్చదనంతో(Greenary) నిండిపోయి కనిపిస్తుంది. వేసవి కాలం పోయి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని వెదజల్లుతుంది. నదులలో నీరు నిండి తొనసలాడుతుంటాయి. గణపతి జన్మ నక్షత్రం అయిన బుధగ్రహానికి ఆకుపచ్చనివంటే చాల ఇష్టం. గణపతికి కూడా గడ్డిజాతి మొక్కలంటే చాలా ఇష్టం. అందుకే గణపతికి(Lord Vinayaka) 21 గడ్డి జాతి మొక్కలను సమర్పించి పూజలు చేస్తారు. ఒండ్రుమట్టితో(Sand) చేసిన వినాయకుని ప్రతిమను మాత్రమే గణేష్ పూజకు ఉపయోగించడంలో ఒక విశేషముంది. అందుకు కారణం జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల జలాశయంలో నీళ్లు తేటపడతాయి. జలాశయాల్లో మట్టిని తీసి దానితో బొమ్మను చేయడం వల్ల ఆ మట్టిలోని మంచి గుణాలు మన ఒంటికి పడతాయి. ఆ ఒండ్రుమట్టిలో నానడం వలన మన ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు. వినాయక విగ్రహాన్ని 11వ రోజున వైభవంగా జల నిమజ్జనం చేయడంలో కూడా ఒక రహస్యం ఉంది అదేంటో ఇక్కడ చూద్దాం.
10 రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి విగ్రహాన్ని(Ganapati statue) 11వ రోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పంచ భౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జన్మించిన ప్రతి ఒక్క సజీవ మరియు నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా మరియు విలాసమైన జీవితం గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసి పోవాల్సిందే. అందుకే ప్రకృతి దేవుడైన మట్టి గణపతిని(Mud Ganapati) చేసి, అంగరంగా వైభవంగా పూజలు చేసి ప్రజల కోలాహలం హడావిడి నడుమ వినాయకుడిని ఊరేగించి చివరికి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఎంత గొప్పగా బతికినా వారైన చివరికి మట్టిలో కలిసి పోవాల్సిందే అన్న ఒక్క సారాంశంతో వినాయకుడి నిమజ్జనం చేస్తారు.
గణపతి పూజ కోసం మట్టి విగ్రహం మరియు పత్రిలను ఉపయోగించడం వెనుక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ మరియు పత్రాలలోనూ ఔషధ గుణాలు ఉంటాయి. గణపతికి చేసే పూజలో భాగంగా మనం గణపతి విగ్రహాన్ని మరియు పత్రాలనూ తాకడం వలన వాటిలోని ఔషధితత్వం మనకి చేరుతుంది. విగ్రహాన్నీ మరియు పత్రాలనూ ఇంట్లో ఉంచడం వలన చుట్టూ ఉన్న గాలిలోకి కూడా ఆ ఔషధ గుణాలు చేరతాయి. 9 రోజుల పాటు విగ్రహాన్నీ మరియు పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలో కానీ నిమజ్జనం చేస్తాము. వినాయక చవితి నాటికి వర్షాలు బాగా పడతాయి. వాగులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఆ సమయంలో నదులలో మట్టి విగ్రహాలను నిమజ్జనం(Immersion) చేయడం వల్ల వరద ఉధృతి తగ్గే అవకాశం ఉంటుంది.
వర్ష కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు అధికంగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో కూడా నీరుని క్రిమిరహితంగా మారిపోతుంది. అందువల్లనే నిమజ్జనం చేసే ఆచారం ఉన్న దసరా, బతుకమ్మ పండుగలు కూడా వర్ష రుతువులో వస్తాయి. గణపతి ప్రతిష్ట(Ganapati Prestige) కోసం రంగు విగ్రహాలను నీటిలో కలపడం వలన నిమజ్జనం వెనుక ఉన్న ఉద్దేశాలని దెబ్బతీస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రకృతిని కొలవడం అలాగే భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికి మరియు ఆడంబరానికి పెద్ద పీట వేస్తున్నాయి.