మహారాష్ట్ర(MAHARASHTRA)లోని ఠాణె(THANE)లో ఘోర ప్రమాదం(ACCIDENT) జరిగింది. నిర్మాణంలో(CONSTRUCTION) ఉన్న భవనంలోని(BUILDING) లిఫ్ట్(LIFT) కుప్పకూలింది(COLLAPSED). ఈ ఘటనలో ఆరుగురు కూలీలు(6lABORERS ) మరణించగా(DIED).. పలువురు గాయపడ్డారు(SEVERLY INJURED). ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది(FIRE DEPARTMENT) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రి(HOSPITAL)కి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు(POLICE) తెలిపారు. ఆదివారం రాత్రి ఘోడ్‌బందర్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు వెల్లడించారు.
అది నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ అని.. సాధారణ ఎలివేటర్(NORMAL ELIVATOR) కాదని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్(THANE MUNCIPAL COMMISSION) అధికారి(OFFICER) యూసిన్ తాడ్వి(YASIN TADVI) తెలిపారు. 40 అంతస్తు(40 FLOOR) నుంచి లిఫ్ట్ కుప్పకూలినట్లు చెప్పారు. కూలీలు తమ పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు.. ప్రమాదానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక కార్పొరేటర్ సంజయ్ డిమాండ్ చేశారు. సంఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు కోసం గాలిస్తున్నారు. ఇంతటి ఘోర ప్రమాదం జరగడం చాలా బాధాకరమని.. ప్రమాదానికి కారణం అయ్యినవారిని కఠినంగా శిక్షించాలని స్థానిక కార్పొరేటర్ సంజయ్ కోరారు. చనిపోయిన ఆరుగురు కూలీలు పొట్ట కూటి కోసం కష్టపడే వాళ్ళని.. ఇప్పుడు వారి మరణంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన వాపోయారు.