ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్(STAMPS AND REGISTRATIONS) వ్యవస్థకు ఆధునిక సాంకేతికత(NEW TECHNOLOGY)ను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం(GOVERNMNET) శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్(CARD PRIME SOFTWARE), ఈ-స్టాంపింగ్(E STAMPING), గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్(REGISTRATION) సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. పైలట్ ప్రాజెక్టు(PILOT PROJECT)గా ఇప్పటికే 23 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఇకపై ఆన్‌లైన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కలగనుంది.
కార్డ్ ప్రైం అప్లికేషన్(APPLICATIONS) ద్వారా వినియోగదారులు తమ దస్తావేజులు తామే స్వయంగా రూపొందించుకోవడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలు సైతం సొంతంగా కాలిక్యులేట్ చేసుకుని ఆన్ లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ప్రభుత్వం కల్పించనుంది. అనుకూలమైన సమయాల్లో రిజిస్ట్రేషన్ టైం స్లాట్ బుక్ చేసుకునే సౌలభ్యంతో పాటు వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం త్వరలో రానుంది. ఈ-సైన్ సౌకర్యంతో డాక్యుమెంట్స్‌కు మరింత భద్రత చేకూరనుంది. ఎటువంటి అవినీతికి తావులేకుండా పూర్తి పారదర్శకతతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన వెంటనే రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్పు వంటి పనులు వేగంగా జరగనున్నాయి. ఆధునిక సాంకేతికత వినియోగం ద్వారా ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్ల నిర్మూలన కూడా సాధ్యం కానుంది.
స్టాంప్ డ్యూటీ(STAMP DUTY), ఇతర ఛార్జీలు ఆన్ లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నారు. స్టాంపులు కృత్రిమ కొరత, నకిలీలు, పాత తేదీల స్టాంపులకు చెల్లు చీటీ పాడతారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ (SHCL) బ్రాంచ్ లు, స్టాంపు వెండార్లు, కామన్ సర్వీస్ సెంటర్లలో (CSC) ఈ స్టాంపింగ్ సేవలు లభిస్తాయి.రాష్ట్రవ్యాప్తంగా 2500 సెంటర్ల ద్వారా ఈ- స్టాంపుల విక్రయం చేపట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామ/వార్డు సచివాలయాల్లో సైతం పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలు కల్పిస్తున్నారు. తొలి విడతగా 1680 గ్రామ/వార్డు సచివాలయాలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా అప్ గ్రేడ్ చేశారు. త్వరలో మిగిలిన గ్రామ/వార్డు సచివాలయాల్లో కూడా సేవలను విస్తరిస్తారు. తద్వారా ప్రజల చెంతకే అన్ని రిజిస్ట్రేషన్ సౌకర్యాలు వస్తాయి. ముఖ్యంగా స్టాంప్ విక్రయ సేవలు, ఈసీ (ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్), సీసీ, హిందూ మ్యారేజ్ రిజిస్ట్రేషన్, మార్కెట్ వాల్యూ అంచనా వంటి అన్ని సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.