పచ్చదనాన్ని రంగరించుకున్న నీలి సముద్రం, తెల్లని ఇసుక తిన్నెలు, దట్టంగా అల్లుకున్న సుగంధద్రవ్యాల వృక్షాలు, స్థానిక జాలరుల సంప్రదాయ జీవనశైలి, అంతర్జాతీయస్థాయి హాలిడే రిసార్టులతో కనువిందు చేస్తున్న ఈ ప్రదేశాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అదే లక్షద్వీప్. లక్క దీవులు అని ముద్దుగా పిలుచుకునే ఇక్కడి విశేషాలు తెలుసుకోండి.
లక్షద్వీప్.. ఇది మొత్తం 39 దీవుల సముదాయం. అయితే ఇందులో కేవలం పదింటిలో మాత్రమే జనావాసం నివాసం ఉంటుంది. ఈ దేవులో పెద్దది ఆండ్రోత్తి కాగా, చిన్న దీవి బిట్రా. వలయాకారంగా ఉండే పగడపు దీవుల్లో స్కూబా డైవింగ్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఉండే బంగారం ద్వీపంలో వివిధ జాతుల పక్షులు పర్యాటకులని ఇట్టే ఆకట్టుకుంటాయి. స్కూబాడైవింగ్, స్నార్క్లింగ్, సర్ఫింగ్, కయాకింగ్, కేనోయింగ్, వాటర్ స్కీయింగ్, యాచ్టింగ్ వంటి జలక్రీడలు లక్షద్వీప పర్యాటక ఆకర్షణలలో ప్రబలమైనవి. ఇక్కడ చేసే బొట్టు ప్రయాణంలో అద్భుత ప్రకృతి దృశ్యాలు తనివి తీరా చూడవచ్చు. అన్ని దీవుల్లో వినోదానికి మాత్రం కేరాఫ్ అడ్రస్ కవరత్తి ద్వీపం.
ఇక్కడ షాపింగ్ ప్రదేశాలు,కొన్ని హెరిటేజ్, మ్యూజియంలు, మసీదులును సందర్శించవచ్చు. కయాకింగ్ , రీఫ్ వాకింగ్ వంటి వాటికి ప్రసిద్ధి.ఈ ద్వీపం లోనే తిలక్కం, పిట్టి, చేరియం ఐలాండ్ లు వుంటాయి.ఇక్కడ 37 మీటర్ల పొడవైన లైట్ హౌస్ కలదు. ఒక్కసారి పైకి వెళ్ళితే, కల్పేని ద్వీప అందాలు, సముద్రం చక్కగా చూడవచ్చు. మాలిక ద్వీపం పూర్తిగా కొబ్బరి , తాటి చెట్లతో నిండి, చక్కని ప్రకృతి దృశ్యాలతో ఒక విశ్రాంత ప్రదేశంగా వుంటుంది. ఇక్కడి వాతావరణం , ఆహారం ఏ మాత్రం కలుషితం లేక ఒక నిర్మల ప్రదేశ అనుభవాలను అందిస్తాయి. ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది. సీషెల్సు బీచ్ రిసార్టు, ఐలాండ్ హాలిడే హోమ్, లక్షద్వీప్ హోమ్‌స్టే, కోరల్ ప్యారడైజ్, కాడ్‌మట్ బీచ్ రిసార్టు వంటి వాటిలో బస ఇంకో మధురానుభూతిని ఇస్తుంది.
ఎలా వెళ్ళాలి
లక్షద్వీప్‌కు దగ్గరగా ఉన్న తీరం కేరళలోని కొచ్చి నగరం.కొచ్చిన్ అనేది లక్షద్వీప్ కి గేట్ వే వంటిది గా చెప్పవచ్చు. విమానాశ్రయం అగట్టిలో మాత్రమే కలదు. అగట్టి ద్వీపంలో దిగిన తర్వాత ఇతర దీవులకు వెళ్లడానికి హెలికాప్టర్, ఫెర్రీ, షిప్, మిషన్‌బోట్ సౌకర్యం ఉంటుంది. లక్షద్వీప్ పర్యాటక శాఖ కొచ్చి నుంచి అగట్టి దీవికి షిప్ క్రూయిజ్ నడుపుతోంది. కొచ్చిన్ నుండి లక్షద్వీప్ చేరాలంటే జల మార్గాల ద్వారా అయితే 14 నుంచి 18 గంటల దూరం పడుతుంది.
1 comment
Wow, The beautiful places to visit Lakshadweep!!