ఒకప్పుడు తెల్లజుట్టు వయస్సు పైబడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ ప్రజెంట్ చిన్న పిల్లలకు కూడా వైట్ హెయిర్స్ రావడం కామన్ అయిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వరల్డ్‌వైడ్‌గా మారుతున్న పర్యావరణ వ్యవస్థ, ఆహార గొలుసుపై ప్రతికూల ప్రభావాలు కొంత కారణం అవుతున్నాయి. మరోవైపు ఆహారంలో లోపిస్తున్న పోషకాలు, విటమిన్లు, మానసిక ఒత్తిడి, మద్యపానం, స్మోకింగ్ వంటి అలవాట్లు కూడా తెల్లజుట్టు రావడానికి దోహదం చేస్తున్నాయి. కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల వైట్ హెయిర్ ఎర్లీగా రావడాన్ని అడ్డుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. అందుకోసం ముందుగా మెంటల్ స్ట్రెస్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం బెటర్. అలాగే మెడిటేషన్, యోగా, డీప్ బ్రీత్ వంటివి స్ట్రెస్ రిలీఫ్ కలిగిస్తాయి. ఇక విటమిన్ బి12 లోపంవల్ల కూడా తెల్లజుట్టు వస్తుంది, కాబట్టి అది ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. ప్రధానంగా కోడిగుడ్లు, మిల్క్ ప్రొడక్ట్స్, పప్పు ధాన్యాలు ఇందుకు హెల్ప్ అవుతాయి. వీటితోపాటు అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్, సీడ్స్, నట్స్, ఫిష్, మాంసం వంటివి చిన్నప్పటి నుంచి ఆహారంలో తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే, యంగ్ ఏజ్‌లో తెల్లజుట్టు రావడానికి బ్రేక్ పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.