Monday, December 23, 2024
Home భక్తి Suryanar Temple : ఏలినాటి శని నుండి విముక్తి ప్రసాదించే సూర్యనార్ ఆలయం

Suryanar Temple : ఏలినాటి శని నుండి విముక్తి ప్రసాదించే సూర్యనార్ ఆలయం

by స్వేచ్ఛ
0 comment 91 views
kumbhakonam suryanar temple

నవగ్రహ స్తోత్రంలో ‘ఆదిత్యయాచ’ అంటూ తొలుత సూర్య భగవానుడినే ప్రార్థిస్తాం. అలాంటి సూర్య భగవానుడు ఇతర గ్రహాలతో కలిసి వెలసిన ప్రాంతమే కుంభకోణం. ఈ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహదోషాల నుంచి కూడా విముక్తి పొందచ్చు. ఆ దివ్యక్షేత్రమే సూర్యనార్‌ ఆలయం. ఈ పుణ్యక్షేత్రం చరిత్రపై ప్రత్యేక కథనం..

తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం పరిసర ప్రాంతాల్లో నవగ్రహాలు కొలువైవున్నాయి. ఇక్కడ నవ గ్రహాలకు వేర్వేరుగా ఆలయాలు ఉన్నాయి. సూర్యభగవానుడు మధ్యలో ఉంటే, ఆ ఆలయానికి చుట్టూ మిగిలిన 8 గ్రహ ఆలయాలు ఉన్నాయి. అన్ని నవగ్రహాల్లో శివుడు ప్రధాన దైవమైతే ఈ ఆలయంలో మాత్రం సూర్యడు ప్రధాన దైవం. సూర్యనార్ కోయిల్ దక్షిణ తమిళనాడు రాష్ట్రంలో ఉన్న పవిత్రమైన హిందూ దేవాలయంగా భక్తులు భావిస్తారు. ఇది తంజావూరు జిల్లాలోని సూర్యనార్కోవిల్ గ్రామంలో ఉంది. ఇది అత్యంత ప్రసిద్ధిగాంచిన సూర్య నవగ్రహ దేవాలయాలలో ఒకటి. సూర్య భగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు. భక్తులకు ప్రసాదంగా కూడా అదే. కుంభకోణానికి 15 కిలోమీటర్ల దూరంలో సూర్యనార్‌ దేవాలయం వెలసివుంది.

సూర్యనార్‌ ఆలయాన్ని క్రీస్తుశకం 11వ శతాబ్దంలో కుళోత్తుంగ చోళ మహారాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. అనంతరం విజయనగర రాజులు, ఇతర రాజవంశాలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పూర్తిగా గ్రానైట్‌తో నిర్మించారు. ఈ ఆలయంలో ఇతర గ్రహాధిపతులకు ప్రత్యేకమైన చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో విశ్వనాథ, విశాలాక్షి, నటరాజ, శివగామి, వినాయక, మురుగన్‌ విగ్రహాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రధాన ఆలయ మందిరానికి అతి సమీపంలోనే బృహస్పతి ఆలయం ఉంది.

కులోతుంగ చోళ శాసనాలు ఈ ఆలయాన్ని కులోతుంగ చోళ మార్తాండ దేవాలయంగా సూచిస్తున్నాయి. కులోతుంగ చోళులు కనౌజ్ యొక్క గహద్వాల్ రాజవంశంతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారని చెప్పబడింది, దీని పాలకులు సూర్యుడిని ఆరాధించేవారు, కాబట్టి సూర్యనార్ కోయిల్ దక్షిణ భారతదేశంలో వారి ప్రభావానికి వ్యక్తీకరణగా పరిగణించబడుతుంది

రథంలో సూర్యనారాయణడిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలోనే మూలవిరాట్టు అయిన సూర్యభగవానుడు తన ఇద్దరు సతులైన ఉషా, ప్రత్యూషలతో ఆశీనులై భక్తులకు దర్శనమిస్తుంటాడు. రెండు చేతుల్లో తామర పుష్పాలు కలిగి భక్తకోటికి ఆశీర్వచనాలు ప్రసాదిస్తున్న ముద్రలో ఉంటాడు. ఈ ఆలయంలో కాశీ విశ్వనాథ్, విశాలాక్షి గురు దేవాలయాలు ఉన్నాయి. ఇతర ఖగోళ వస్తువుల దేవాలయాలు ఆలయం వెలుపల ఉన్నాయి.

ప్రార్థనా మందిరం, మంటపం రాతితో చెక్కబడ్డాయి, మిగిలిన మందిరాలు ఇటుకతో నిర్మితమయ్యాయి. కూల్తార్థ వినాయక్ మందిరం ఇక్కడ ప్రధాన ఆకర్షణగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఇక్కడ వేడిగా ఉండటం ప్రత్యేకత. అన్ని శివాలయాల్లో మహాదేవుడుకి ఎదురుగా నంది ఉంటుంది. కానీ, ఇక్కడ సూర్యదేవుడుకి ఎదురుగా అశ్వం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడి రథాన్ని లాగేది గుర్రాలే కాబట్టి అశ్వం దర్శనమిస్తుంది.

తొమ్మిది గ్రహాలలో, సూర్యుడికి దాని ప్రాథమిక స్థానం ఇవ్వబడుతుంది, కాబట్టి వారంలోని మొదటి రోజు ఆదివారం అని పిలువబడుతుంది. వారంలోని ఏడు రోజులు రాశులతో సహా ఏడు గ్రహాలను సూచిస్తాయి. ఇక్కడి సూర్య దేవుడు భక్తులను మంచి ఆరోగ్యం, ఖ్యాతి మరియు సమర్థవంతంగా జీవనం సాగించాలని ఆశ్శీస్సులు అందిస్తాడని పండితులు చెబుతున్నారు. ఈ ఆలయంలో పూజ చాలా నిష్ఠగా ఉంటుంది. పూజానంతరం ఆలయం చుట్టూ 9 సార్లు ప్రదక్షిణం చెయ్యవలసి ఉంటుంది. ఈ నవగ్రహ దేవాలయాల ప్రదక్షిణను భక్తులు పవిత్రంగా భావిస్తారు. సూర్య భగవానుడికి చక్కెర పొంగలిని నైవేద్యంగా పెడతారు. భక్తులకు ప్రసాదంగా కూడా దానినే అందిస్తారు.

ఆలయ పురాణ గాధ…

కాలవముని అనే యోగి కుష్ఠువ్యాధితో బాధపడుతుండేవాడు. ఆ బాధ నుంచి తనను రక్షించాలని నవగ్రహాలను ప్రార్థించాడు. ఆయన ప్రార్థనకు అనుగ్రహించిన గ్రహాధిపతులు కాలవమునిని వ్యాధి నుంచి విముక్తి చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ కన్నెర్రజేస్తాడు. మానవుల్లో మంచి, చెడులకు సంబంధించిన ఫలితాలను ఇవ్వడమే గ్రహాల పని అని పేర్కొంటూ తమ పరిధిని అతిక్రమించిన గ్రహాలను భూలోకంలోనే శ్వేతపుష్పాల అటవీప్రాంతానికి వెళ్ళమని శపిస్తాడు. దీంతో భూలోకానికి వచ్చిన నవగ్రహాలు లయకారుడైన పరమశివుని కోసం తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు ప్రత్యక్షమైన మహాశివుడు వారికి శాపవిముక్తి చేస్తాడు. అంతేకాకుండా, వారు ఎక్కడైతే తనను పూజించారో అక్కడ వారికి మహాశక్తులను ప్రసాదిస్తాడు. ఆ క్షేత్రంలో ఎవరైనా భక్తులు వచ్చి తమ బాధలను తీర్చమని నవగ్రహాలను వేడుకుంటే వారికి బాధలు ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు.

సౌర ప్రలోభాల వ్యవధి ఆరు సంవత్సరాలు. ‘సాటర్న్’, శని, అష్టమశిని లేదా ఏలినాటిశని మరియు జన్ శని గ్రహాల ప్రతికూల ప్రభావాలను అనుభవిస్తున్న వారు సూర్యనార్కోవ్‌ను సందర్శించి పూజలు చేయటం ద్వారా వారి కష్టాల నుండి ఉపశమనం పొందవచ్చు. సూర్యభగవానుడితో పాటు గురుడుని 11 ఆదివారాలు పూజిస్తే ఏలినాటి శనితో పాటు ఇతర గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నాడి పరిహారం, నవగ్రహ హోమాలు, సూర్య అర్చన వంటి పూజలు నిర్వహిస్తారు.

You may also like

Leave a Comment

* By using this form you agree with the storage and handling of your data by this website.

Our Company

ADBC delivers accurate news coverage across diverse topics, providing engaging content, breaking updates, and insightful analysis to keep our audience well-informed.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Latest News

@2021 – All Right Reserved. Designed and Developed by ADBC News