తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు(Interesting developments) చోటుచేసుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు చోట్ల సిట్టింగ్‌లకు ప్లేస్ లేకపోవడంతో ఆయా స్థానాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ నేతలే పార్టీ హైకమాండ్‌పై సీరియస్ అవుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, స్టేషన్ ఘన్‌పూర్(Station Ghanpur) నియోజకవర్గంలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య(MLA Rajaiah)ను కాదని కడియం శ్రీహరికి సీటు ఖరారు చేయడంతో ఆయన హైకమాండ్‌పై పోరుకు రెడీ అయ్యారు. సమయం దొరికిన ప్రతీసారి శ్రీహరిని టార్గెట్ చేస్తూ రాజయ్య సెటైర్లు వేశారు. పరోక్షంగా శ్రీహరిని ఓడిస్తా అనే రేంజ్ వరకు వెళ్లారు. ఈనేపథ్యంలో తాజాగా ప్రగతి భవన్(Pragati Bhavan)లో రాజయ్య, శ్రీహరితో మంత్రి కేటీఆర్(Minister KTR) సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జరిగిన భేటీలో రాజయ్య శాంతించారు. వచ్చే ఎన్నికల్లో కడియం గెలుపునకు పార్టీ కోసం పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే శ్రీహరికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు.
అటు రాజయ్యకు కేటీఆర్ కీలక హామీ ఇచ్చారు. రాజయ్యకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. రాజయ్య భవిష్యత్త్‌కు సీఎం కేసీఆర్, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక, కేటీఆర్ ఇచ్చాన భరోసాతో రాజయ్య మెత్తబడ్డారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నాని తెలిపారు. బీఆర్‌ఎస్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.