టీడీపీ అధినేతచంద్రబాబు(TDP leader Chandrababu) ఎపిసోడ్ చూడటం లేదని టీవీలో వచ్చినా ఛానల్ మారుస్తున్నానని.. మా బాధలు మాకున్నాయని కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి(MP Komati Reddy Venkat Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరికలపై ఒకటో తేదీన హైకమాండ్ లో మీటింగ్ ఉందని స్పష్టం చేశారు. దాంట్లో మాట్లాడతా అంటూ తెలిపారు. ఇప్పుడు నా జిల్లాలో mla లు గెలవడం ఎలా అనే దానిపైనే ఉందని కోమటి రెడ్డి తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ పై మండిపడ్డారు. 24 గంటలు కరెంటు ఇవ్వనందుకు రైతులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీలో టికెట్ల అంశం అధిష్ఠానంతో చర్చ చేస్తామని అన్నారు.
కొత్త మనోహర్ రెడ్డి(New Manohar Reddy) ఎవరో తెలియదని, ఏం మాట్లాడిండో తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. BRs ఎన్ని అమ్ముకుందో చెప్పాలా? అని మండిపడ్డారు. హరీష్ హైట్ పెరిగిండు కానీ బుర్ర పెరగలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS) అంటే.. బొందల రాష్ట్ర సమితి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంతర్గత అంశాలు ఢిల్లీలో మాట్లాడుకుంటాం.. ఇక్కడ మాట్లాడను అన్నారు. ఐటీతో వస్తున్న ఆదాయం మా కృషి ఫలితం అని అన్నారు. ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అన్ని అమలులో ఉన్నాయని తెలిపారు.
బంగారు తెలంగాణ కాదు..బతుకు నిచ్చే తెలంగాణ చేస్తామన్నారు. దళిత బందులో brs నేతలు దోచుకున్న డబ్బులు చాలు.. ఆరు పథకాలు అమలుకు సరిపోతాయన్నారు. కేసీఆర్ ఎన్ని స్కిం లు వదిలినా జనం నమ్మరని అన్నారు. దళితుల భూములు లాక్కుని రియల్ ఎస్టేట్ వాళ్ళకు అప్పగిస్తున్నాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ని కర్ణాటక తీసుకు వెళ్తామని, సిద్ధరామయ్యకి కూడా కేసీఆర్ ని ఆహ్వానం పలకండని చెప్తా.. స్పెషల్ ఫ్లైట్ పెడతా అన్నారు. కేసీఆర్ కర్ణాటకలో బస్సు ఎక్కి చూస్తే తెలుస్తుందని, మంత్రి వర్గం అంతా వచ్చినా తీసుకుపోతామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.