తెలుగు రాజకీయాల్లో ఇదొక కీలక తరుణం. 371 కోట్ల(371 CRORES) అవినీతి కేసులో చంద్రబాబు(CHANDRABABU) ప్రమేయం ఉన్నట్టు ప్రాధమికంగా నిర్ధారించిన విజయవాడ ఏసీబీ కోర్టు(VIJYAWADA ACB COURT).. రిమాండ్(JUDICIAL REMAND) విధిస్తూ స్పష్టమైన తీర్పునిచ్చింది. నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు జైలు యోగం అనేది నేషనల్ బ్రేకింగ్(NATIONAL BREAKING) న్యూస్. చంద్రబాబు రాజకీయ జీవితంపై ఇదొక మాయని మచ్చ. అటు.. పెళ్లిరోజున(WEDDING DAY) జైలుకెళ్లాల్సి రావడం అనేది చంద్రబాబును వ్యక్తిగతంగా కుంగదీసే అంశం. తాజాగా ఇదే అంశంపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని(YCP MLA KODALI NANI) స్పందించారు. దేవుడి ముందు ఎవరూ తప్పించుకోలేరని చంద్రబాబు విషయంలో నిజమైందన్నారు నాని. లోకేశ్ ఇప్పటికైనా డైలాగ్స్ మానేయ్యాలని హితవు పలికారు. స్కిల్ స్కామ్ చంద్రబాబును సీఎం జగన్ జైలుకు పంపిన విషయం కూడా లోకేశ్(LOKESH) తన రెడ్ బుక్(RED BOOK)లో రాసుకోవాలని ఎద్దేవా చేశారు. బాబును అరెస్ట్ చేయగానే.. అసలు పుత్రుడి కంటే దత్త పుత్రుడి హడావిడి ఎక్కువైందన్నారు. ప్యాకేజీ తీసుకొని(PACKAGE) , అర్ధరాత్రి వచ్చి పవన్‌కళ్యాణ్(PAWAN KALYAN) హడావుడి చేశారని విమర్శించారు.
‘‘చంద్రబాబు స్కామ్ చేయనిది ఎప్పుడు?. ఆయనో 420, అవినీతి చక్రవర్తి అని ఎన్టీఆర్(NTR) ఏనాడో చెప్పారు. బాలకృష్ణ(BALAKRISHNA), పురందేశ్వరి(PURANDERESHWARI) ఆ అవినీతి చక్రవర్తికి మద్దతిస్తారా?. బాలకృష్ణ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. లోకేష్ రాసిచ్చిందా? చంద్రబాబు డైలాగులా.. అవన్నీ?. చంద్రబాబుతో కలిసి తండ్రి ఎన్టీఆర్‌కు పురందేశ్వరి వెన్నుపోటు పొడిచారు. పవన్ కల్యాణ్‌తో పార్టీ పెట్టించిన వ్యక్తే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు పెట్రోల్ కొట్టిస్తేనే.. పవన్ తన వారాహి(VARAHI)ని బయటకు తీస్తాడు. ప్యాకేజీ తీసుకునేవాడు అంతకన్నా ఏం మాట్లాడతాడు!.
చంద్రబాబు అవినీతిలో వీళ్లందరికి భాగం ఉంది. కాబట్టే.. దొంగలంతా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తారు. లేకుంటే వీళ్ల పేర్లు ఎక్కడ బయటపెడతాడో అనే భయం ఉంటుంది కదా. అందుకే.. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌నే వీళ్లంతా చదువుతారు అని కొడాలి నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్య అని, ప్రభుత్వం చేయిస్తోంది అని టీడీపీ,రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న విమర్శల్ని కొడాలి నాని కొట్టి పారేశారు. వైఎస్సార్‌కు చంద్రబాబుకు 40 ఏళ్లపాటు రాజకీయ వైరం కొనసాగిందని.. ఏనాడూ కక్ష రాజకీయాలు కనిపించలేదన్న సంగతి గుర్తు చేశారు. ఈ కేసులో పది మంది అరెస్ట్ అయ్యారు. కొంతమందికి బెయిల్ వచ్చింది.. కొంత మందికి జైల్లో ఉన్నారు అని గుర్తు చేశారు. చంద్రబాబు మీద విచారణ జరిగింది. చివరకు అరెస్ట్ చేశారు అని కొడాలి తెలిపారు.