రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. టాలీవుడ్‌లో తన స్థానం పదిలం చేసుకునేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని సినిమాలు అనుకున్న ఫలితాలన్ని ఇవ్వకున్నా.. తన ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. అయితే, తాజాగా ఈ యంగ్ హీరో గురించి ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. రాజావారు రాణివారు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన రహస్య గోరఖ్‌తో ప్రేయమాణం వార్తలతో కిరణ్ అబ్బవరం హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో కిరణ్, రహస్య గోరఖ్‌ల మధ్య స్నేహం మొదలైందని, ఆ తర్వాత ప్రేమికులుగా మారారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరిపై సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినా.. ఏమాత్రం పట్టించుకోలేదు.
విహార యాత్రకూ కలిసే..
కొన్ని రోజుల క్రితం వెకేషన్‌కు వెళ్లిన కిరణ్ అబ్బవరం.. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అదే సమయంలో రహస్య గోరఖ్ కూడా కొన్ని ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇద్దరూ కలిసి ఒకే ప్రాంతానికి వెకేషన్‌కు వెళ్లారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే సమయంలో కిరణ్ అబ్బవరం నూతన గృహప్రవేశ వేడుకల్లోనూ రహస్య కనిపించింది.
కిరణ్ సమాధానం ఏంటంటే?
అషూరెడ్డి హోస్ట్‌గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ‘దావత్’ అనే కొత్త ప్రోగ్రాంను మొదలుపెట్టింది. కాగా, ఈ షోకి కిరణ్ అబ్బవరం ఫస్ట్ గెస్టుగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో అషూ రెడ్డి కిరణ లవ్ మ్యాటర్‌ని అడిగేసింది. రహస్య గోరఖ్‌తో రిలేషన్‌లో ఉన్నారా? అంటూ సూటిగా ప్రశ్నించింది. దీనికి కిరణ్ సమాధానమిస్తూ అబ్బే అలాంటిదేమీ లేదు, అంతా ఉత్తిదే అంటూ చెప్పుకొచ్చాడు. ఏదైనా ఉంటే చెప్తాం అనగానే.. ఇద్దరూ కలిసి పెళ్లి డేట్ ఒకేసారి అనౌన్స్ చెస్తారా? అంటూ అషూరెడ్డి ఆటపట్టించింది. దీంతో సిగ్గుపడిపోయిన కిరణ్.. నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో ఎప్పుడూ ఇంతలా దొరికిపోలేదు అని చెప్పుకొచ్చాడు. దీంతో ఫ్యాన్స్ నిజంగానే వీరిద్దరి మధ్య ప్రమ వ్యవహారం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.