తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే టికెట్ల విషయం పై ప్రకటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు 115 మందికి టికెట్లను కూడా కేటాయించారు. కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోటిఫికేషన్ వేసి దరఖాస్తు చేసుకుని ఎంపిక చేయనున్నారు. కాంగ్రెస్ నోటిఫికేషన్ కి డబ్బులు చెల్లించగా.. బీజేపీ మాత్రం ఎలాంటి డబ్బులు లేకుండా ఎన్నికల అభ్యర్థుల ఎంపికకు నోటిఫికేషన్, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇలా ఎవ్వరికీ వారు ఇప్పటి నుంచే ఎన్నికల గురించి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. క్టోబరులో ఎన్నికలు (Telangana Assembly Elections 2023) జరగకపోవచ్చని అన్నారు.
అక్టోబరులో రాష్ట్ర ఎన్నికలకు నోటిఫికేషన్(Telangana Assembly Elections Notification) రాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. మరో ఆరు నెలల తర్వాతే తెలంగాణ ఎన్నికలు ఉండొచ్చని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలోనే జరగొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. దీనిపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత స్పష్టత రావచ్చని తెలిపారు. జమిలి ఉన్నా లేకపోయనా తనకేం లాభం లేదని స్పష్టం చేశారు. ఇవాళ ప్రగతి భవన్లో మీడియా మిత్రులతో ఆయన చిట్‌చాట్ నిర్వహించని పలు అంశాలపై స్పందించారు. జాతీయ పార్టీలు దిల్లీ బానిస పార్టీలని కేటీఆర్ (Minister KTR)వ్యాఖ్యానించారు. ఆత్మగౌరవమున్న తెలంగాణ ప్రజలు బానిసత్వ పార్టీలను అంగీకరించరన్నారు. దిల్లీ బానిసలు కావాలా.. తెలంగాణ బిడ్డ కావాలా రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని స్పష్టం చేశారు. కిరణ్ కుమార్‌రెడ్డి, కేవీపీ, వైఎస్ షర్మిల(YS Sharmila) వంటి తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమవుతున్నారన్నారు.
పదేళ్ల అభివృద్ధిని తెలంగాణ వ్యతిరేకుల చేతులు పెడదామా..? అనేది ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణం ఉందన్నారు. ఈసారి ఎన్నికల్లో 90 స్థానాలకు పైగా గెలుస్తామని.. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి నుంచి వస్తున్న ఫీడ్‌బ్యాక్ సమాచారం ప్రకారం.. కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.