తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు శుభవార్త చెప్పింది. దసరా నుండి తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్(Morning Breakfast) అందజేయనున్నట్లు తెలిపింది. ముఖ్యమంత్రి బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ (Chief Minister’s Breakfast Scheme)పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొస్తుంది. అక్టోబర్ 24 న దసరా రోజు ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్(CM KCR) సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను(Education system) బలోపేతం చేస్తూ, విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
దసరా కానుకగా, అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వున్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో ( 1 నుంచి 10 వ తరగతుల వరకు) చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం(Chief Minister’s Breakfast Scheme) అందించాలని సిఎం కేసీఆర్ నిర్ణయించారు. తద్వారా విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందిచే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనున్నది. తద్వారా నిరుపేద కుంటుంబాలకు చెందిన విద్యార్థులకు పౌష్టికాహారం(Nutritious food) అందించడంతో పాటు వారికి చదువు పట్ల ఏకాగ్రతను పెంచే దిశగా చర్యలు చేపట్టింది. ఉదయాన్నే వ్యవసాయం పనులు కూలీపనులు చేసుకోవడానికి వెల్లే విద్యార్థుల తల్లిదండ్రులు పడే ఇబ్బందులను అర్థం చేసుకున్న సిఎం కేసీఆర్ మానవీయ ఆలోచనకు అద్దంపట్టే దిశగా ఈ అల్పాహారం పథకాన్నిరాష్ట్ర ప్రభుత్వం దసరానుంచి అమలు చేయనున్నది.
ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఈ పథకం విధానాన్ని పరిశీలించి రావాలని ఐఎఎస్ అధికారుల బృందాన్ని సిఎం కేసీఆర్ ఇటీవలే పంపించారు. కాగా అక్కడ విజయవంతంగా అమలవుతున్న ‘ విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని అధ్యయనం చేసిన అధికారుల బృందం ప్రభుత్వానికి నివేదిక అందించింది. తమిళనాడులో కేవలం ప్రాథమిక పాఠశాలల వరకే అమలు చేస్తున్నారనే విషయాన్ని సిఎం కేసీఆర్ దృష్టికి తీసుకువచ్చింది. కాగా విద్యార్థుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించే సిఎం కేసీఆర్ గారు ఖర్చుకు వెనకాడకుండా ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కూడా బ్రేక్ ఫాస్టు ను అందచేయాలని నిర్ణయించారు. ఇందుకు గాను రాష్టర ప్రభుత్వ ఖజానా పై ప్రతి యేటా దాదాపు రూ. 400 కోట్ల అదనపు భారం పడనున్నది.