ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రకటించడంపై రాష్ట్ర కాపు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని, లేదంటే పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తమ మద్దతు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కాకినాడ(Kakinada)లో జరిగిన కాపుల చర్చా గోష్టిలో నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నామని కాపు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ టీడీపీ(TDP) పొత్తుతో మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతాడని అన్నారు. చంద్రబాబు ఒక దొంగ.. ఆయన మాటల్ని తాము నమ్మలేమని చెప్పారు. టీడీపీతో పొత్తు లేకుండా జనసేన(Janasena) ఒంటరిగా పోటీ చేయాలని కోరుతున్నట్లు కాపు నేతలు చెప్పారు. అలా పోటీ చేస్తేనే కాపుల మద్దత్తు పవన్ కు ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చా గోష్టిలో కాపు నేతలు, న్యాయవాదులు,చిరంజీవి.. పవన్ అభిమానులు పాల్గొన్నారు.
మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని తెలుగుదేశం శాసనసభ పక్షం నిర్ణయించింది. పోరాటమే అజెండాగా పెట్టుకున్నప్పుడు… ప్రజల కోసం ఎన్ని అవమానాలైన భరిద్దామని నారా లోకేశ్ (Nara Lokesh) స్పష్టం చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టు(Chandrababu Illegal Arrest) అంశంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు చట్ట సభల వేదికను వదులుకోకూడదని లోకేశ్ పేర్కొన్నారు. సభలో చేయాల్సిన పోరాటం సభలో చేద్దాం.. వీధుల్లో చేయాల్సిన పోరాటం వీధుల్లో చేద్దాం అని చెప్పారు. చంద్రబాబు అరెస్టు అక్రమమనే విషయాన్ని చట్ట సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీఎల్పీ నిర్ణయించింది.