కావేరీ నదీ(KAUVERI RIVER) జలాల విషయంలో గత కొన్ని ఏళ్లుగా కర్ణాటక(KARNATAKA), తమిళనాడు(TAMILNADU)ల మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, తమిళనాడు వాటాగా నీళ్లను విడుదల చేసిన నేపథ్యంలో కర్ణాటకలో ఆందోళనలు మొదలయ్యాయి. రాజకీయ(POLITICAL), సినీ ప్రముఖులు(CINI CELBRITIES) నిరసన వ్యక్తం చేశారు. నిరసన, ఆందోళనల వలన సమస్య పరిష్కారం కాదని.. ప్రభుత్వాలే(GOVERNMENTS) కూర్చుని మాట్లాడుకుని ఓ నిర్ణయానికి రావాలని సినీ ప్రముఖులు అంటున్నారు. ఇక, ఈ నేపథ్యంలోనే కావేరీ జలాల విషయంలో కర్ణాటకకు న్యాయం కోరుతూ.
ప్రముఖ కన్నడ నటుడు(KANNADA ACTOR) ప్రేమ్(PREM) నెనపిరావి ప్రధాని మోదీకి(PRIME MINISTER NARENDRA MODI) రక్తంతో లేఖ రాశారు. ఆ లేఖలో… ‘‘ ప్రధాని నరేంద్ర మోదీ గారికి.. కర్ణాటకకు, కావేరీకి న్యాయం చేయండి. కావేరీ మాది’’ అని రాసి ఉంది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గంటల్లోనే లక్షకుపైగా వ్యూస్(VIEWS), లైక్స్(LIKES) సంపాదించుకుంది. ఇక, ఆ లేఖపై స్పందిస్తున్న నెటిజన్లు.. కేంద్రం జోక్యం చేసుకుంటేనే ఆ సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. అలా కాకపోతే ఎన్ని ఏళ్లు అయినా.. ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
కాగా, కొన్ని రోజుల క్రితం హీరో సిద్దార్థ్ ఓ సినిమా ప్రమోషన్(CINEMA PROMOTION) కోసం బెంగళూరు(BENGALURU) వెళ్లారు. అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్(PRESS CONFERENCE)లో ఉండగా.. ఆందోళనకారులు ఆయన్ని అక్కడినుంచి వెళ్లిపోమన్నారు. దీంతో ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ సంఘటనపై హీరో శివరాజ్‌కుమార్(HERO SIVARAJ KUMAR) స్పందించారు. హీరో సిద్ధార్థ్(HERO SIDDHARDH)కు బహిరంగం క్షమాపణ చెప్పారు. అలాంటి సంఘటనలు జరక్కుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. మరి, నటుడు ప్రేమ్ నెనపిరావి ప్రధాని మోదీకి రక్తంతో లేఖ రాయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.