ఈ మధ్య ఏ పండుగ(FESTIVAL) వచ్చినా.. అది ఏ రోజు నిర్వహించుకోవాలని అనేదానిపై సందిగ్ధత నెలకొంటుంది.. పండితులు, అర్చకుల్లోనూ దీనిపై భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి.. కొందరు ఈ తిథిలో నిర్వహించుకోవాలి అంటే.. లేదు లేద.. ఆ గడియాలే కీలకం అని వాధిస్తున్నారు మరికొందరు. అయితే, ఈ నెలలో రాబోతోన్న వినాయక చవితి(VINAYAKA CHAVATHI) విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కొందరు అంటుంటే.. లేదు 19వ తేదీయే శ్రేయస్కరం అంటున్నారు మరికొందరు. అయితే, వినాయక చవితి పండగ జరుపుకునే తేదీపై క్లారిటీ ఇచ్చారు కాణిపాకం(KANIPAKAM) ఆలయం(TEMPLE) అర్చకులు(PRIESTS).
ఈ నెల 18వ తేదీన వినాయకచవితి నిర్వహించుకోవాలని కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం అర్చకులు చెబుతున్నమాట.. వినాయక చవితి జరుపుకొని తేదీ అనేక రకరకాల ప్రచారాలు జరుగుతూన్నాయి.. ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి తేదీ 18-9-2023 సోమవారం(MONDAY) నాడు ఉదయం 10-15 నిమిషాలు నుండి మరుసటి రోజు ఉదయం 10-43 నిమిషాలు వరుకూ ఉంటుంది.. అంటే 18-9-2023 రోజు రాత్రి మాత్రమే చవితి(CHAVATHI) తిథి ఉంది.. ఆ తిథి ప్రాకారం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈనెల 18వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి.. ఈ నెల 18వ తేదీ నుండి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని కాణిపాకం వరసిద్ధి వినాయక(VARASIDDI VINAYAKA) ఆలయం ప్రధాన వేద పండితులు సుబ్బారావు శర్మ ప్రకటించారు.