Jio Bharat: పండుగ ముందర రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. తాజాగా తక్కువ బడ్జెట్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. JioBharat B1 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్ లాంచ్ అయింది. కంపెనీ ఈ తాజా ఫోన్‌లో పెద్ద డిస్‌ప్లే, శక్తి వంతమైన బ్యాటరీని అందిస్తోంది. ఇది మాత్రమే కాకుండా Jio Bharat B1 ద్వారా UPI చెల్లింపులు సులభంగా చేయగలుగుతారు. ఇందుకు JioPay యాప్ మీకు సహాయం చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
JioBharat B1 ఫీచర్లు
అమెజాన్‌లోని ఉన్న సమాచారం ప్రకారం ఫోన్ 2.4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మెరుగైన కనెక్టివిటీ కోసం 4G సపోర్ట్‌ను పొందుతుంది. 2000 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలా సమయం వస్తుంది. ఈ సరసమైన ఫోన్ 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. ఇతర మోడల్స్ మాదిరిగాన ఈ ఫోన్‌లో కూడా జియో సినిమా, జియో సావ్న్ యాప్‌ను ముందే ఇన్‌స్టాల్ చేస్తారు.
ఇండియాలో JioBharat B1 ధర
ఇండియాలో ఈ ఫోన్ బ్లాక్ కలర్‌లో ప్రారంభించారు. జియో అధికారిక స్టోర్ కాకుండా అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు. పండుగల సీజన్‌ను ఉద్దేశించి ఈ ఫోన్‌ను కేవలం రూ.1299కే విడుదల చేశారు. పాత, కొత్త జియో సిమ్ రెండూ ఈ జియో ఫోన్‌లో పని చేస్తాయి. అయితే ఈ ఫోన్ కోసం మీరు రూ. 123 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.