బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(SHARUKH KHAN) వరుస సినిమాల(CINEMA)తో బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం జవాన్(JAWAN) సినిమా ప్రమోషన్స్(PROMOTIONS)లో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో షారుఖ్ తిరుమల(TIRUMALA) శ్రీవేంకటేశ్వర స్వామివారి(SRI VENKATESWARA SWAMY)ని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చిన ఆయన శ్రీవారి సుప్రభాత సేవ(SUPRABATHA SEVA)లో పాల్గొన్నారు.. తన కూతురు సుహానా ఖాన్(SUHANA KHAN), నటి నయనతార(NAYANATHARA), విగ్నేష్ (VIGNESH) దంపతులతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపం(RANGANAYAKULA MANDAPAM)లో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. టీటీడీ(TIRUMALA TIRUPATHI DEVASTHANAM) అధికారులు షారుఖ్ ఖాన్‌కు ఆలయ ప్రధాన ద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
షారుఖ్ ను చూసేందుకు అక్కడ భక్తులు ఎగబడ్డారు.. కొందరు సెల్ఫీలు(SELFIE) కూడా దిగారు.. షారుఖ్ ఖాన్ ఉన్నంతవరకు ఆలయంలో సందడి వాతావరణం నెలకొంది.. షారుఖ్, నయనతార జంటగా నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. గతనెల 31న విడుదలై ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ తండ్రి కొడుకు రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. తమిళ(TAMIL) స్టార్ డైరెక్టర్(STAR DIRECTOR) అట్లీ(ATLEE) దర్శకత్వం(DIRECTION) వహించిన ఈ సినిమాలో దీపికా పదుకోన్(DEEPIKA PADUKONE), విజయ్ సేతుపతి(VIJAY SETUPATHI), ప్రియమణి(PRIYAMANI), సాన్య మల్హోత్రా, యోగిబాబు, రిధి డోగ్రా కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
ఇకపోతే ఇప్పటికే జవాన్ చిత్రయూనిట్ ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైకు రాగా నేడు ఉదయం షారుఖ్ ఖాన్, నయనతార, మరికొంతమంది చిత్రయూనిట్ తో కలిసి తిరుమలకు వచ్చి వేంకటేశ్వరస్వామి వారి దర్శనం చేసుకున్నారు. షారుఖ్ ఖాన్ తన లైఫ్ లో తిరుమలకు రావడం ఇదే మొదటిసారి. సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు జవాన్ చిత్రం టీం..మొదటిసారి షారుఖ్ ఖాన్ తిరుమలకు రావడంతో ఆలయంలోకి నడిచి వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.