బాలీవుడ్(BOLLYWOOD) బాద్షా(BADSHA) షారుక్ ఖాన్(SHARUKH KHAN) ‘జవాన్'(JAWAN).. సెప్టెంబర్ 7న(SEPTEMBER 7) రిలీజై బాక్సాఫీస్(BOX OFFICE) వద్ద ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జవాన్ అనేక రికార్డులు(RECORDS) సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. తాజాగా జవాన్ రూ. వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ఈ సినిమా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్లు వసూల్ చేసింది. దీంతో షారుక్ తన కెరీర్లో వరుసగా రెండోసారి వెయ్యి కోట్ల మార్క్‌ను అందుకున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ(ATLEE) ఈ సినిమాను తెరకెక్కించారు. షారుక్‌కు జోడీగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార నటించారు. ఈ సినిమాలో ఆమె ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించారు. ఇక స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా.. సీనియర్ నటి ప్రియమణి, యోగి బాబు, రిద్ధి దోగ్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించారు. షారుక్‌కు జోడీగా సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార నటించారు. ఈ సినిమాలో ఆమె ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించారు. ఇక స్టార్ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించగా.. సీనియర్ నటి ప్రియమణి, యోగి బాబు, రిద్ధి దోగ్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. మ్యూజిక్ సంచలనం అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు.